BREAKING
నిత్యం పండ్లు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: సహజ సిద్ధమైన విటమిన్లు, ఫైబర్‌తో పరిపూర్ణ ఆరోగ్యం ఇరువురు తహసీల్దార్ లు, ఇరువురు డిప్యూటీ తహసిల్దార్ లపై క్రమశిక్షణ చర్యలు. తాడిగడప మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.95 లక్షలు నిత్యం పప్పులు, శనగలు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు: ఆరోగ్యానికి ప్రొటీన్, ఫైబర్ పెన్సిలిన్ పెన్షన్లు అందని పేదలకు బొండా ఉమా అండ * సొంత నిధులతో ప్రతినెలా ఆర్థిక సాయం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ స్పీచ్: అభిమానులకు మాస్ ప్రామిస్ పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో వీఐపీ దర్శనాలు రద్దు మానకొండూరులో పాత ఇనుప సామాను దుకాణంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి: 20 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలపై అధికారులకు శిక్షణ సరస్ మేళాకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలి : నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర రాత్రి కనకదుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తాసిల్దార్ కు వినతి పత్రం అందించిన డీలర్లు రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలి తహశీల్దార్‌కు 46 మంది డీలర్ల వినతిపత్రం ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - సురక్షితంగా బాలుడి అప్పగింత. - ముగ్గురు నిందితుల అరెస్ట్

పోలీసు గ్రీవెన్స్‌లో 74 ఫిర్యాదులు స్వీకరణ... ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలి

Select Suryaa Now
పోలీసు గ్రీవెన్స్‌లో 74 ఫిర్యాదులు స్వీకరణ...  ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరపాలి

శ్రీకాకుళం, సూర్య :  ప్రజల నుంచి అందే ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి ఫిర్యాదుపై చట్టప్రకారం సమగ్ర విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

సోమవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ (పబ్లిక్ గ్రీవెన్స్) కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ మొత్తం 74 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై వెంటనే విచారణ ప్రారంభించి, చట్టపరమైన చర్యల ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి అర్జీని ప్రత్యేక శ్రద్ధతో పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, మోసపూరిత కేసులు, పౌర సంబంధిత సమస్యలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులపై చేపట్టిన విచారణ, తీసుకున్న చర్యల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.

 

రిపోర్టర్ : గోపాల్ కృష్ణ, నరసన్నపేట, శ్రీకాకుళం జిల్లా.