BREAKING
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు వెబ్‌సైట్లను నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించిన యూరోపియన్ ఏజెన్సీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశం పుంగనూరులో ఉద్రుక్తత ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు ! ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు: నలుగురు పౌరులు మృతి యూకే వెల్త్ మేనేజర్ లయన్ ట్రస్ట్...తగ్గిన త్రైమాసిక నిధుల వెనక్కితీత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ యువ నాయకుడు షఫీ ఫ్రాన్స్ ఆర్థిక మార్కెట్లను వెంటాడుతున్న ముప్పు దివాలా పిటిషన్ దాఖలు చేసిన గెట్టి ఇమేజెస్ ఎట్టకేలకు జాక్‌డావ్ గ్యాస్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన యూకే ప్రభుత్వం పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి* త్రైమాసిక ఆదాయంలో అంచనాలను తలకిందులు చేసిన ఎస్సిలార్‌లక్సోటికా నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి!

పోలీస్ అమరవీరులకు ఘన నివాళి.

Select Suryaa Now
పోలీస్ అమరవీరులకు ఘన నివాళి.

కళ్యాణదుర్గం: విధి నిర్వహణలో ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కళ్యాణదుర్గం డీఎస్పీ టీ. దైవప్రసాద్ పేర్కొన్నారు. అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసుల పేర్లను స్మరించుకుని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం పోలీసులు నిరంతరం పనిచేస్తూ అనేక సవాళ్లను ఎదుర్కొంటారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రజల రక్షణకు అంకితభావంతో సేవలందించడం పోలీసుల బాధ్యతకు నిదర్శనమన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని, ప్రజలు కూడా పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేలా తమ వంతు బాధ్యత నిర్వహించాలని సూచించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకోవడంతో పాటు విధి నిర్వహణలో అంకితభావం, ధైర్యం, సేవా స్ఫూర్తిని చాటిచెప్పే సందర్భమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ టీ. దైవప్రసాద్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు వి. హరినాథ్, నీలకంఠ, గంగాధర్ తదితరులు పాల్గొని పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు.

కళ్యాణదుర్గం టౌన్ రిపోర్టర్ :-రంగస్వామి.