BREAKING
ఎస్సై ఓం ప్రకాష్ కు ఘన సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం బొంతు గీతకు రెడ్డి శాంతి సన్మానం మత్స్యకారులకు నిత్యవసర వస్తువులు పంపిణీ ఎమ్మెల్యే బోనెల విజయచంద్రను మర్యాదపూర్వకంగా కలిసిన గొల్ల నరసింహ యాదవ్ సోదరులకు ఘన సన్మానం. మల్లూరు గుట్టకు మహిళల పాదయాత్ర నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీలకు ఘన సత్కారం.. ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డిపిఓ. ఎంపీడీవో డిప్యూటీ ఎంపీడీవో సాలూరు రైలు బండిని పునరుద్ధరించండి కశ్మీర్ లోయ, చీనాబ్ వ్యాలీలో వరుస ఉగ్రదాడులు: భద్రతా బలగాల విజయాలకు ఎదురైన కొత్త సవాల్! తొలి రోజు నామినేషన్లకు స్పందన దశదిన కర్మ కు హాజరైన సర్పంచ్.. బండి స్వామి పీఎస్ఎల్వీ రీ-ఎంట్రీపై తొందరపాటు తగదు.. అనంతగిరి లో అందుబాటులోకి వచ్చిన ఏకలవ్య పాఠశాల

పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత.

Select Suryaa Now
పంచాయతీ నామినేషన్లకు పటిష్ట భద్రత.


- ఎస్పీ తుహిన్ సిన్హా.

అనకాపల్లి, నవంబర్ 15, మేజర్ న్యూస్: జిల్లాలో నేటి నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు, ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధి నిబంధనను కఠినంగా అమలు చేయాలి. అనుమతి లేని వ్యక్తులను ఆ పరిధిలోకి అనుమతించరాదు. నామినేషన్ కేంద్రాల సమీపంలో గుంపులుగా గుమికూడటం, ఊరేగింపులు నిర్వహించడానికి అనుమతి లేదు. ట్రాఫిక్‌కు, సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలి. నామినేషన్లు జరుగుతున్న మొత్తం 8 మండలాల్లో పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.