BREAKING
రెండో విడత గ్రామ సర్పంచ్ నామినేషన్లకు పటిష్ట భద్రతా ఏర్పాటు ‘బై’ రేటింగ్ కొనసాగిస్తూ రూ. 3,820 టార్గెట్ ప్రైస్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేన్స్ టెక్నాలజీ షేర్లపై బ్రోకరేజ్ విశ్లేషణ దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదల, వ్యోమగామి కావాలనుకునే అమ్మాయికి అండగా హీరో విద్యార్థులకు ప్రాథమిక హక్కులపై అవగాహన కార్యక్రమం.. ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ విస్తృత దాడులు.. కర్ణాటక మద్యం స్వాధీనం. బ్రాకరేజ్ రిపోర్ట్: ఏబీబీ ఇండియా, రిలాక్సో ఫుట్‌వేర్ త్రైమాసిక ఫలితాల విశ్లేషణ & హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ కొత్త టార్గెట్ ప్రైస్‌లు! రెవెన్యూ వసూళ్లపై సమీక్ష.. రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం.. వంద శాతం పన్నుల వసూలుకు మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంత్ రావు ఆదేశాలు.. కలెక్టర్ ఆఫీసు గ్రంథాలయమునకు పుస్తకాల వితరణ మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ టాక్ షో ‘మెగావర్స్’లోకి కోలీవుడ్ స్టార్ జంట సూర్య మరియు జ్యోతిక మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి 58వ పుట్టినరోజు వేడుకలు బి.వి. నగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలి భారత ఉపాధి మార్కెట్‌లో సానుకూల సంకేతాలు.. తిరుపతి డిప్యూటీ మేయర్‌గా శైలజ వేణుగోపాల్‌కు అవకాశం కల్పించాలి నేరేడ్‌మెట్, కాకతీయ నగర్ డివిజన్లలో రూ.2.20 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం ఈ నెల 19న పారా క్రీడాకారుల జిల్లా స్థాయి ఎంపికలు - పోస్టర్ లాంచ్

పంచాయతీ ఎన్నికల్లో యువతకు, విద్యావంతులకు బీజేపీలో అవకాశం బిజెపి జిల్లా అధ్యక్షులు పి.వీ కృష్ణారావు

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో యువతకు, విద్యావంతులకు బీజేపీలో అవకాశం   బిజెపి జిల్లా అధ్యక్షులు పి.వీ కృష్ణారావు

మార్కాపురం, మేజర్‌న్యూస్‌ : 

పంచాయతీ ఎన్నికల్లో యువతకు, విద్యావంతులకు బీజేపీ అవకాశం కల్పిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పి.వీ కృష్ణారావు అన్నారు. మంగళవారం స్థానిక ప్లస్ క్లబ్ లో బిజెపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో యువత, విద్యావంతుల అవసరం ఎంతో ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి చదువుకున్న యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
బీజేపీ ఎప్పుడూ యువతను  ప్రోత్సహిస్తుందని తెలిపారు. యువతకు పార్టీలో తగిన గుర్తింపు, బాధ్యతలు ఇచ్చి ముందుకు తీసుకెళ్తామన్నారు. సామాన్య కార్యకర్త కూడా బీజేపీలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
యువత బీజేపీలో చేరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కోరారు. విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి వస్తే గ్రామాల్లో మార్పు వస్తుందని ఆశ భవాని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి పంచాయతీకి ప్రతి ఏడానికి 15 నుంచి 25 లక్షల వరకు నిధులు వస్తాయన్నారు. ప్రజలకు అవినీతి రహిత, పారదర్శక పాలన అందుతుందని చెప్పారు.
గ్రామ పంచాయతీలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు యువత కృషి చేయాలి అని పి.వీ కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల శివప్రసాద్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు లక్ష్మి మారం రెడ్డి, జిల్లా సంయుక్త కార్యదర్శి,జిల్లా ఉపాధ్యక్షులు
కే.రాజా శ్రీకాంత్ ,కోశాధికారి
డి. చంద్రశేఖర్ ,26వ వార్డు కౌన్సిలర్ బి. కృష్ణారావు 
బీజేవైఎం రాష్ట్ర నాయకులు జానకి జనార్ధన్,చిన్నయ్య నాయకులు,రామ్ చంద్ర,
బంగారయ్య తదితరులు పాల్గొన్నారు.