BREAKING
ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం! రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.  రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగే అవకాశం: జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ

పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చేబ్రోలు శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

Select Suryaa Now
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చేబ్రోలు శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి

సూర్య పొలిటికల్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఏకాదశి వ్రతాచరణలో భాగంగా మంగళవారం ఉదయం ఆయన చేబ్రోలు గ్రామంలోని శ్రీ సీతారామస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి ప్రాతఃకాల సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు వేద మంత్రోచ్ఛారణలతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.

సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో చేబ్రోలులోని శ్రీ సీతారామస్వామి వారి ఆలయం సమీపంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఆలయ అభివృద్ధికి ఆయన ప్రత్యేక చొరవ చూపారు. రెండు విడతలుగా దాదాపు రూ.90 లక్షల నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులతో ఆలయంలో కాలక్షేప మండపం, రథశాల, అన్నదానం కోసం ప్రత్యేక హాలు, యాగశాల నిర్మాణంతో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రిని స్థానికులు, పార్టీ శ్రేణులు అభినందించారు