BREAKING
శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎస్టీయు కృత్రిమ మేధస్సు ప్రమాదాల కట్టడికి గ్లోబల్ రెగ్యులేటరీ సంస్థ: 20 దేశాల కీలక ఉమ్మడి ప్రతిపాదన గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత వీఎల్‌ఎస్‌ఐ సాంకేతికతతో తదుపరి తరం బయోసెన్సర్‌ డిజైన్‌పై వర్క్‌షాప్ రాయవరంలో వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక ద్రవ్యోల్బణ సెగతో ఆర్బీఐ కీలక నిర్ణయం?: 2026లో రెండుసార్లు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చన్న నివేదిక ఐరాస వేదికగా దౌత్య పర్వం పాకిస్తాన్‌లో మరో పరువు హత్య: నవవధువును కాల్చి చంపిన సొంత సోదరుడు.. కరాచీలో దారుణం ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం

హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ

Select Suryaa Now
హైదరాబాద్‌ మాదాపూర్‌లో  ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ

సూర్య క్రైమ్ డెస్క్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సిద్దిఖీనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత, కలకలం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన షారోన్‌ నిఖిత అనే యువతి ఓయో రూమ్‌లో అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. తన ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి ఆమె ఆ గదికి వెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అర్ధరాత్రి దాటిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న యువతిని హోటల్ నిర్వాహకుల సహాయంతో ఆ యువకుడు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే యువతి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి హోటల్ గదిని పరిశీలించారు. మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అలాగే హోటల్ గదిలోని గోడలపై, బెడ్‌షీట్‌పై రక్తపు మరకలు ఉండటంతో ఇది ముందస్తు పథకం ప్రకారం జరిగిన హత్యగా పోలీసులు భావిస్తున్నారు. ఆసుపత్రికి చేర్చిన తర్వాత యువతి మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రియుడు శ్రీనివాస రవితేజ అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దంపి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.