పి జి ఆర్ ఎస్ కార్యక్రమం రద్దు
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్: జిల్లాలో స్థానిక సంస్థల మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎలక్షన్ కోడ్ అమలు లోకి వచ్చినందున, జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పిజిఆర్ఎస్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.ఈ ఎన్నికల కోడ్ అక్టోబర్ 14 నుండి డిసెంబర్ 03 వరకు అమలులో ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ గడువు ముగిసే వరకు ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు సమర్పణ కోసం కలెక్టరేట్ కు రావద్దని సూచించారు.
ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.