BREAKING
పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా.. ఎస్పీ డాక్టర్ వినీత్ ఏడాది ప్రయాణంపై సూర్య ప్రత్యేక కథనం అమెరికా లేబర్ మార్కెట్‌లో జోరు: జూలై తర్వాత కనిష్టానికి నిరుద్యోగ క్లెయిమ్‌లు.. 1.97 లక్షలకు క్షీణత! ‘ఆ అనుభూతిని మళ్లీ ఆస్వాదించాలనుంది’: ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం

ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం

Select Suryaa Now
ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం

ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలు పరిష్కరించాలని నిరసన కార్యక్రమం

ఎంపీడీవో నడిమింటి సూర్యనారాయణకు వినతి అందుజేత

నల్ల సూర్యనారాయణ, ఆదినారాయణ,వెంకట నాయుడు

గరుగుబిల్లి,సెప్టెంబర్ 30, మేజర్ న్యూస్:
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న క్షేత్ర సహాయకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఎదుట క్షేత్ర సహాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా క్షేత్ర సహాయకుల సంఘం నాయకులు నల్ల సూర్యనారాయణ,నగిరెడ్డి ఆదినారాయణ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గడిచిన 20 సంవత్సరముల నుండి క్షేత్ర సహాయకులుగా పనిచేయడం జరుగుతుందన్నారు.ప్రస్తుతం ఇస్తున్న చాలీచాలని వేతనము వల్ల కుటుంబాలతో బతకడం కష్టంగా మారిందన్నారు.క్షేత్ర సహాయకులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలన్నారు.మేన్ డేస్ టార్గెట్ విధానమును రద్దు చేయాలన్నారు.అర్హతతో పాటు అనుభవము ఉన్న క్షేత్ర సహాయకులకు పదోన్నతులు కల్పించాలని సంఘ నాయకులు సూర్యనారాయణ, ఆదినారాయణలు డిమాండ్ చేశారు.క్షేత్ర సహాయకులు ఉపాధి వేతన దారులకు ఆర్థిక భరోసా కల్పించడంతోపాటు గ్రామ పంచాయతీ స్థాయిలో సుస్థిర,శాశ్వత వనరుల ఏర్పాటు, గ్రామాల అభివృద్ధికి తోడ్పడడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకమును దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను మొదటి స్థానంలో నిలబెట్టడంలో క్షేత్ర సహాయకుల కృషి కీలక మైనదన్నారు.క్షేత్ర సహాయకుల అక్రమ తొలగింపులు నివారించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ సమస్యలు పరిష్కారం అవుతాయని క్షేత్ర సహాయకులు భావించడం జరిగిందని అయితే గత ప్రభుత్వంలో జరిగినట్టుగానే గడిచిన రెండు సంవత్సరాలలో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులు పెద్ద ఎత్తున జరిగాయన్నారు.క్షేత్ర సహాయకుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం తగు చర్యలు చేపట్టకపోతే సమ్మె చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘ నాయకులు నల్ల సూర్యనారాయణ, ఆదినారాయణలు పేర్కొన్నారు.నిరసన కార్యక్రమం అనంతరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి నడిమింటి సూర్యనారాయణకు క్షేత్ర సహాయకులు వినతి పత్రమును అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు గాడి వెంకటనాయుడు,తెర్లి చిన్నమ్మలు,మామిడి అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.