BREAKING
మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి

Select Suryaa Now
ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలి


బాడంగి, సెప్టెంబర్‌ 30 (మేజర్‌ న్యూస్): గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల ప్రజాపరిషత్‌ అభివృద్ధి అధికారి శ్రీలతకు బుధవారం సిఐటియు నాయకులు శంకరరావు ఆధ్వర్యంలో మండలంలో గల పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు  వినతిపత్రం సమర్పించారు.
గత 19 సంవత్సరాలుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు సేవలందిస్తున్నప్పటికీ ప్రస్తుతం నెలకు రూ.5,745 మాత్రమే వేతనం అందుతోందని, కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని కోరారు. అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు.
మూడు నెలలు పూర్తిచేసిన వారికి ఎఫ్‌టీఈ హోదా కల్పించాలని, ఉపాధి సిబ్బందికి వర్తింపజేస్తున్న మస్టర్‌ డే విధానం (7,500) రద్దు చేయాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.25 లక్షలు చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఏపీఎస్‌ఆర్‌ఎల్‌ఎం కింద అలవెన్స్‌ కల్పించాలని, ఎన్‌ఎంఎంఎస్‌, భువన్‌ తదితర యాప్‌లతో పాటు కొత్తగా వచ్చిన మొబైల్‌ యాప్‌ల నుంచి ఫీల్డ్‌ అసిస్టెంట్లను మినహాయించాలని కోరారు. అలాగే క్యాష్‌లెస్‌ హెల్త్‌ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా  ఉద్యమాన్ని చేపడతామని సిఐటియు నాయకులు అన్నారు