BREAKING
మున్సిపల్ వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ అభ్యర్థిగా చిమట లక్ష్మి నామినేషన్ సర్పంచ్ బండ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో టేకులపల్లిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు కూటమి చైర్ పర్సన్ అభ్యర్థిగా అవర్ణ నామినేషన్ దాఖలు సౌదీ స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు పూల పండుగతో మురిసిన రాజీవ్ గాంధీ నగర్ జనసేన పార్టీలో చేరిన వడ్డీవారి పాలెం మాజీ సర్పంచ్ సర్పంచ్ లావణ్య మోహన్ ఆధ్వర్యంలో దుర్గం చెరువులో ఘనంగా బతుకమ్మ సంబరాలు కెనడా మిలిటరీ బేస్‌లో ఘోర అగ్నిప్రమాదం...ఏడుగురు మృతి కోలాహలంగా కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లు అవకాశమివ్వండి 21వ వార్డును అభివృద్ధి చేస్తా : బర్నేపల్లి రవికుమార్ ఆక్రమిత ప్రాంతంలో అమెరికా అధికారుల పర్యటన రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల. కౌన్సిలర్ అభ్యర్థిగా పంతానీి నాగమల్లేశ్వరి నామినేషన్ కుష్నర్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక చర్చలు టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ కు మంత్రి అనగాని నివాళులు

పెనుకొండ లో ఎన్నికల నగారా

Select Suryaa Now
పెనుకొండ లో ఎన్నికల నగారా

పోటాపోటీగా 76 నామినేషన్లు దాఖలు – మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ వెల్లడి
పెనుకొండ మున్సిపాలిటీ వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియలో భాగంగా 18.10.2026 నాటికి మొత్తం 76 నామినేషన్లు అందినట్లు మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 23 వార్డులకు గాను వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉత్సాహంగా పాల్గొని తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
పార్టీల వారీగా పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ (TDP) నుంచి అత్యధికంగా 35 నామినేషన్లు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR CP) నుంచి 22 నామినేషన్లు దాఖలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థుల నుంచి 7 నామినేషన్లు రాగా, జనసేన పార్టీ నుంచి 4, భారతీయ జనతా పార్టీ (BJP) నుంచి 3 నామినేషన్లు నమోదయ్యాయి. ఇతర పార్టీల విభాగంలో ఎంఐఎం (MIM) నుంచి 4, ఎస్డీపీఐ (SDPI) నుంచి ఒక నామినేషన్ రాగా, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఎటువంటి నామినేషన్లు నమోదు కాలేదు.
వార్డుల వారీగా చూస్తే, 1వ వార్డులో అత్యధికంగా 7 నామినేషన్లు సమర్పించారు. 8, 12, 13వ వార్డులలో ఐదేసి చొప్పున, 2, 6, 9, 11, 16వ వార్డులలో నాలుగేసి చొప్పున నామినేషన్లు వచ్చాయి. అదే విధంగా 3, 7, 10, 14, 15, 18వ వార్డులలో మూడేసి చొప్పున దాఖలు కాగా, 4, 5, 17, 19, 20, 21, 22, 23వ వార్డులలో రెండేసి నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తదితర ప్రక్రియలు పారదర్శకంగా కొనసాగుతాయని, అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ సతీష్ కుమార్ స్పష్టం చేశారు.