BREAKING
ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. ఐఐఈఎస్‌టీ షిబ్‌పూర్‌తో టీసీఎస్ ఒప్పందం జమ్మూకశ్మీర్‌లో న్యాయపరమైన చిక్కులు: రూ. 245 కోట్ల విలువైన 113 అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేత ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే బండారు

Select Suryaa Now
పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే బండారు

పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్

125 మందికి రూ.62.44 లక్షల విలువైన చెక్కుల పంపిణీ

కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,958 మందికి రూ.12.43 కోట్ల

పేద  ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.గురువారం కొత్తపేటలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఆత్రేయపురం,రావులపాలెం,కొత్తపేట,ఆలమూరు మండలాలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.62,44,112 విలువైన చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఇందులో 123 రీయింబర్స్‌మెంట్‌ చెక్కులు,రెండు ఎల్‌వోసీలు ఉన్నాయన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు 40 దఫాల్లో 1,958 మంది లబ్ధిదారులకు రూ.12,43,63,630 విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పేర్కొన్నారు.పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు,దరఖాస్తులు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు.అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని చెప్పారు.నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కృతజ్ఞతలు తెలిపారు.