BREAKING
ప్రమాద భరితంగా గంగవరం రోడ్డు పంచాయతీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ రోజున స్థానిక సెలవు నాన్న కాదు.. ఆయనే నా ఫేవరెట్ క్రికెటర్.. విరాట్ కోహ్లిపై ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు శ్రీ దత్త సాయి ఆలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు ఘనంగా సెంచూరియన్‌లో కగిసో రబాడా సరికొత్త చరిత్ర.. డేల్ స్టెయిన్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు! కళ్యాణదుర్గం పట్టణంలో సిపిఎం, సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ కార్యక్రమం. శివాలయంలో భక్తి పరవశం - కార్తీక పౌర్ణమి వేళ ఇస్గాం శివాలయానికి పోటెత్తిన భక్తులు గోపాలపూర్ లో వికసించిన అరుదైన బ్రహ్మ కమలం సూపర్‌మేన్‌లా డైవ్ చేసి కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన కుమార్ కుషాగ్ర.. యూఏఈ మ్యాచ్‌లో అద్భుతం! కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యూఏఈ టాస్ గెలిచి బ్యాటింగ్.. హర్‌ప్రీత్ సెంచరీ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం! ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి - కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావినిల సత్యనారాయణ బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసు వివాదం పరిష్కారం .. 39 ఏళ్ల తర్వాత మర్లపూడిలో టీడీపీ జెండా రెపరెపలు.. విజయానికి యువ నాయకుడు వరదబండి వెంకటేశ్వర్లు రెడ్డి కృషి కీలకం! కష్టాల్లో ఉన్న కుటుంబానికి జిల్లా కలెక్టర్ చేయూత

పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ-- 110 మంది లబ్ధిదారులకు రూ.40.93 లక్షల ఆర్థిక సాయం

Select Suryaa Now
పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ--  110 మంది లబ్ధిదారులకు  రూ.40.93 లక్షల ఆర్థిక సాయం

నరసాపురం, మేజర్ న్యూస్ :

అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్,  బొమ్మిడి నాయకర్ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యేక్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని 110 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.40,93,614 విలువైన చెక్కులను ఎమ్మెల్యే  బొమ్మిడి నాయకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఖరీదైన వైద్య చికిత్సలు అవసరమైన సమయంలో ఆర్థిక భారం కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి  ద్వారా సహాయం అందిస్తోందని తెలిపారు.  అత్యవసర పరిస్థితులు, వైద్య చికిత్సల వంటి సందర్భాల్లో అవసరమైన వారికి ఆర్థిక సహాయం అందించే ప్రభుత్వ పథకం. 

“ప్రజల ఆరోగ్యం, సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఆర్థిక స్థోమత లేక వైద్యం చేయించుకోలేని కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి” అని  బొమ్మిడి నాయకర్ అన్నారు.

నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని, వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల్లో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందుబాటులో ఉన్న సహాయాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఆర్థిక సహాయం అందడంతో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

 నరసాపురం ఇజ్రాయిల్