BREAKING
జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ. సెలవుల్లో కంప్యూటర్‌ పాఠాలు

పవన్ కళ్యాణ్ చే ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం నేడే

Select Suryaa Now
పవన్ కళ్యాణ్ చే  ఆత్మకూరు బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవం నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :     ఆత్మకూరు బైపాస్ రోడ్డును   రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  కొణిదల పవన్ కళ్యాణ్  చేతుల మీదుగా మంగళవారం వర్చువల్‌గా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో8.91 కోట్లతో నాలుగు లేన్ల రహదారిగా విస్తరణ గావించి సెంట్రల్ లైటింగ్, సుందరీకరణ, ప్లాంటేషన్‌తో నూతన శోభ చేకూరింది.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ రోడ్డును పరిశీలించారు. ఆత్మకూరు పట్టణ ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు  ఆనం రామనారాయణరెడ్డి  అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆత్మకూరు బైపాస్ రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. సుమారు 8 కోట్ల 91 లక్షల వ్యయంతో బైపాస్ రోడ్డును నాలుగు లేన్ల రహదారిగా విస్తరించడంతో పాటు సెంట్రల్ లైటింగ్, రహదారి సుందరీకరణ, ప్లాంటేషన్ తదితర అభివృద్ధి పనులను పూర్తి చేశారు.ఈ నూతన నాలుగు లేన్ల బైపాస్ రహదారిని మంగళవారం ఉదయం 11:00 గంటలకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి  కొణిదల పవన్ కళ్యాణ్  వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రారంభోత్సవ సభను నిర్వహిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గారు తెలిపారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి  కోరారు.