BREAKING
ప్రశాంత వాతావరణంలో ఎంపీటీసీ,జడ్పిటిసి ఎన్నికలు రామభద్రపురమండలలో74.60శాతం పోలింగ్ ఆషిక్ సుధీర్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' (GOAT) ట్రైలర్ రిలీజ్: యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా అదరగొడుతున్న నటుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శంబంగి *గంట్యాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ సంచలన విజయం: ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్... *జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి * అక్టోబర్‌లో సుమారు 74 విమానాలను డెలివరీ చేసిన ఎయిర్‌బస్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సేధు మాధవన్.... ఫ్రాన్స్‌లో సుమారు 40 శాఖలను మూసివేయనున్న సోసైటీ జనరల్ సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి జడ్పిటిసి అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు కారాడ గ్రామం ముందు విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు ఐసీసీ అక్టోబర్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినీలు ప్రకటన: రేసులో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన సాధారణ పరిశీలకులు తేజ్ భరత్...

పటిష్ట భద్రతా చర్యలతో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు....

Select Suryaa Now
పటిష్ట భద్రతా చర్యలతో ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు....

విజయనగరం,  సూర్య :  విజయనగరం జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జిల్లా పోలీసుశాఖ చేపట్టిన ముందస్తు చర్యలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లుతో చిన్న చిన్న సంఘటనలు మినహా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్  తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్  మాట్లాడుతూ...
పోలింగ్ ప్రారంభం నుంచి రూట్ మొబైల్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు, జోనల్ స్ట్రైకింగ్ ఫోర్సులను నిరంతరం అప్రమత్తం చేస్తూ, వైర్‌లెస్ ద్వారా అధికారులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు, ఆదేశాలు జారీ చేయడం సత్ఫలితాలిచ్చాయన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం, పోలింగ్ కేంద్రాల 100 మీటర్ల పరిధిలో అనధికార వ్యక్తుల సంచారాన్ని నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడం వలన గొడవలు జరగకుండా నియంత్రించగలిగామన్నారు.

సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పాటు, పట్టణంలోని ముఖ్య కూడళ్లలో పికెట్లు ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగించామన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రూట్ మొబైల్ పార్టీలు, ప్రత్యేక బలగాలు సమన్వయంతో విధులను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన పోలీసు భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, అక్కడ నిరంతర పహారా ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, నిరంతర పర్యవేక్షణతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని తెలిపారు.

ఎన్నికల విధులను సమన్వయంతో, సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అదే విధంగా ఎన్నికలను ప్రశాంతంగా ముగించడంలో సహకరించిన ప్రజలకు జిల్లా ఎస్పీ  ఎఆర్ దామోదర్ కృతజ్ఞతలు తెలిపారు.