BREAKING
ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మోడీ. రైతన్నల సుభిక్షమే లక్ష్యం..వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని

పరిశ్రమల్లో కచ్చితంగా కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయాలి*

Select Suryaa Now
పరిశ్రమల్లో కచ్చితంగా కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయాలి*

 

*పరిశ్రమల్లో కచ్చితంగా కాలుష్య నియంత్రణ చర్యలు అమలు చేయాలి*

*పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి*

*CSR ద్వారా ప్రజలకు మేలు చేయాలి*

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య*

కర్నూలు, అక్టోబర్ 06:- పరిశ్రమలలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య జై రాజ్ ఇస్పాత్ పరిశ్రమ  యాజమాన్యాన్ని ఆదేశించారు..

మంగళవారం ఓర్వకల్లు మండలం లోని గుట్టపాడు గ్రామ సమీపంలో ఉన్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి, కాలుష్య నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలు, మొక్కల పెంపకం, ఉద్యోగాల కల్పన తదితర అంశాల గురించి సంస్థ యాజమాన్యం, ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ పి.కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి సమావేశం నిర్వహించారు..

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ పరిశ్రమల్లో స్థానిక ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాల పెంపు, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్ స్పష్టం చేశారు.. పరిశ్రమల ద్వారా స్థానిక యువతకు, డ్రైవర్లకు ఉపాధి లభించేలా అవసరమైన శిక్షణ అందించి, వారికి బ్యాంకు రుణాలు, ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ తెలిపారు.  స్థానిక ప్రజల ఆదరణ, సహకారం పొందేలా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల ద్వారా స్థానిక ప్రజలకు, స్థానిక పరిపాలనకు అవసరమైన సహకారం అందించాలని చైర్మన్ సూచించారు.

పరిశ్రమలలో ఉత్పత్తి ప్రక్రియతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ప్రమాణాల అమలులో ఎలాంటి రాజీకి తావు ఇవ్వకూడదని చైర్మన్ స్పష్టం చేశారు.. ఉద్యోగులు, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, క్రమబద్ధమైన భద్రతా తనిఖీలు, మాక్ డ్రిల్స్ నిరంతరం నిర్వహించాలన్నారు.. పరిశ్రమల అభివృద్ధి, స్థానిక ఉపాధి కల్పనకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే సహించేది లేదని చైర్మన్ స్పష్టం చేశారు. పరిశ్రమ ప్రాంగణాల్లో  పచ్చదనం పెంచేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ యాజమాన్యం వారిని ఆదేశించారు.. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు..

జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (APPCB) చైర్మన్‌, జిల్లా కలెక్టర్ పరిశ్రమ ఆవరణంలో మొక్కలు నాటారు..

కార్యక్రమంలో  జై రాజ్ ఇస్పాత్ ఎండీ గోయంకా, కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, ఏపి ఐ ఐ సి జెడ్ ఎం మధుసూదన్ రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈఈ కిషోర్ రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవ రాజు, జై రాజ్ ఇస్పాత్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.