ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి నారాయణ
నెల్లూరు, మేజర్ న్యూస్ : నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని హరినాథపురంలో ఏర్పాటు చేసిన 25/4 పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని ప్రజలందరూ ప్రజాస్వామ్యంలో తమకు లభించిన ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.