BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో 300 మందికి సురక్షిత ఆశ్రయం సోలార్ ఎనర్జీ సేవలు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీఎం సురేష్* పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక శభాస్ సంపత్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... హెలెన్ కన్సమ్షన్ ఖర్చులపై ద్రవ్యోల్బణ ప్రభావం నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించిన....డాక్టర్ జి జోగి నాయుడు. గుడ్లూరు చెరువు చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఎస్.టి (SST) తనిఖీలను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష మూడో త్రైమాసికంలో 77 శాతం ఎగబాకిన బోలిడెన్ లాభాలు! బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి

ఓటర్ల ఇంటింటికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ : కమిషనర్ వై.ఓ. నందన్

Select Suryaa Now
ఓటర్ల ఇంటింటికీ ఓటర్ స్లిప్పుల పంపిణీ : కమిషనర్ వై.ఓ. నందన్

నెల్లూరు, మేజర్ న్యూస్ :   నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో నవంబర్ 1వ తేదీన జరగనున్న రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్లను చైతన్యవంతులను చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బూత్ లెవల్ అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలతో కూడిన ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తున్నారు.  ఈ విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్, అదనపు ఎన్నికల అధికారి వై.ఓ. నందన్ ఒక ప్రకటనలో వెల్లడించారు. నగర పరిధిలోని ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనేలా, ఓటు వేసేందుకు అవసరమైన వివరాలను సులభంగా తెలుసుకునేలా ఈ స్లిప్పులను అందజేస్తున్నట్లు తెలిపారు.  అధికారులు, బూత్ లెవల్ అధికారులు ఇంటికి వచ్చినప్పుడు నగర ప్రజలు తమ ఓటర్ వివరాలతో కూడిన స్లిప్పులను స్వీకరించాలని ఆయన సూచించారు. నవంబర్ 1న జరిగే సాధారణ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.  ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమని, ఎన్నికల ప్రక్రియలో ప్రజలందరూ చురుకుగా పాల్గొనాలని కమిషనర్ వై.ఓ. నందన్ పిలుపునిచ్చారు.