ఒంటి కాలిపై వీఆర్ఏలు నిరసన
ఒంటికాలుపై విఆర్ఏ లు నిరసన
కొత్తపేట,మేజర్ న్యూస్:తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కొత్తపేట మండల వీఆర్ఏలు చేపట్టిన ఆందోళన సోమవారం నాటికి 13వ రోజుకు చేరుకుంది.ఈ సందర్భంగా స్థానిక పాత బస్టాండ్ వద్ద వీఆర్ఏలు ఒంటికాలిపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వీఆర్ఏలు తెలిపారు.తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు కె.భీమశంకరం,కార్యదర్శి పిల్లంగోరు బాలు,అశోక్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.