BREAKING
ఏపీ ఎన్నికల కమిషన్, డీజీపీలకు వైసీపీ లీగల్ నోటీసులు.. గ్రామీణ అభివృద్ధికి ఆహార సాంకేతికతతో చేయూత.. ధర్మపల్లెలో నిఫ్టెమ్-కుండ్లి విద్యార్థుల క్షేత్రస్థాయి కార్యక్రమం! కామనగరువులో ఇండిపెండెంట్ అభ్యర్థి శివ శ్రీనివాస్ ప్రచారం ఏపీలో రోడ్డు ప్రమాదాల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ డైరెక్టరేట్ (DTMRS) ఏర్పాటు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అరుణాచలంలో భక్తులకు అన్నదానం సర్పంచ్ అభ్యర్థి భీముడుకు మద్దతుగా మెట్ల ప్రచారం.... దౌర్జన్యకాండ సృష్టిస్తున్న టీడీపీ నాయకులను అడ్డుకోండి గరివిడి మండలం విపి రేగ లో విషాదం బాచుపల్లిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు కార్మికుల మృతి మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు.. నంది అవార్డుల నిర్వహణకు ప్రత్యేక అధికారి రేగుంటలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ మర్రికొమ్మదీన్నే సర్పంచ్ గా దానంరెడ్డి గారి అరుణకుమారి ఏకగ్రీవంగా ఎన్నిక నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై స్వరూప్ రాజ్‌కు కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం మున్సిపల్ నూతన వైస్ చైర్మన్ రావిళ్ళ లక్ష్మి, నీ మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు..

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

Select Suryaa Now
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు

స్కానింగ్‌ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలి: డీఎంహెచ్‌వో డా. భారతలక్ష్మి

భీమవరం, మేజర్ న్యూస్: జిల్లాలో చట్టవిరుద్ధంగా గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే సంబంధితులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సి.హెచ్.వి. భారతలక్ష్మి హెచ్చరించారు.సోమవారం ఆమె అధ్యక్షతన జిల్లా స్థాయి గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సలహా సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులు, రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడుతున్న వారిని గుర్తించేందుకు క్రమం తప్పకుండా స్ట్రింగ్ ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. ఆడపిల్లల నిష్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.గర్భస్థ పిండ లింగ నిర్ధారణను ప్రోత్సహించేలా గోడపత్రికలు, హోర్డింగులు లేదా వాణిజ్య ప్రకటనలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పీసీపీఎన్‌డీటీ చట్టం-1994, నిబంధనలు-1996 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఎవరూ ప్రోత్సహించరాదని డీఎంహెచ్‌వో సూచించారు.సమావేశంలో జిల్లా రోగనిరోధక శాఖ అధికారి డాక్టర్ దేవసుధాలక్ష్మి, డాక్టర్ ఎం. సుబ్బలక్ష్మి, డాక్టర్ కె. ప్రవీణ్ కుమార్, డిప్యూటీ డెమో రాజా అక్కులు, డీవైహెచ్‌ఈ వి.ఎస్.ఆర్.కె. కుమారి, ఎంపీహెచ్‌ఈఓ తదితరులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం