రహదారి భద్రతపై అవగాహన
రహదారి భద్రత పై అవగాహన
ఆళ్లగడ్డ, మేజర్ న్యూస్
పట్టణంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో ఆళ్లగడ్డ టౌన్ ఎస్సై చిన్న పీరయ్య ఆధ్వర్యంలో సోమవారంవాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్, వారపు వాహన తనిఖీలలో భాగంగా వాహనదారులను తనిఖీ చేసి, వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని ఎస్సై సూచించారు. వాహనాలకు సంబంధించిన అన్ని రికార్డులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు.