నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయం కోసం మార్కెట్ యార్డ్ స్థలం ఎకరాకు నెలకు కేవలం రూ.85 ధరకు 99 సంవత్సరాలు లీజు దారుణం- నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
-మార్కెట్ యార్డు స్థలం లీజుపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఆగ్రహం...
నంద్యాలలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కార్యాలయం కోసం మార్కెట్ యార్డ్ స్థలం ఎకరాకు నెలకు కేవలం రూ.85 నామమాత్రపు ధరకు ఏకంగా 99 సంవత్సరాలు లీజుకు కేటాయించడం దారుణమన్నారు. ప్రజలకు మంచి చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నూనెపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డు స్థలాన్ని అప్పనంగా లీజుకు తీసుకోవడం అధికార దుర్వినియోగం కాదా అని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు.
కోట్లాది రూపాయల విలువైన రైతులకు సంబంధించిన మార్కెట్ యార్డు స్థలాన్ని టీడీపీ కార్యాలయం కోసం ఎకరాకు నెలకు కేవలం రూ.85 నామమాత్రపు ధరకు ఏకంగా 99 సంవత్సరాలు లీజుకు కేటాయించడం దారుణమని ఆయన మండిపడ్డారు. గతంలో 33 సంవత్సరాలుగా ఉన్న లీజు నిబంధనను మార్చి, కూటమి పెద్దలు ఏకంగా కేబినెట్లో 99 సంవత్సరాలకు లీజుకు ఆమోదం తెలపడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ఆస్తులను పార్టీ కార్యాలయాలకు కట్టబెట్టడంలో కూటమి నేతల నిజాయితీ ఇదేనా అని ఆయన మీడియా ముఖంగా నిలదీశారు.