నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరేద్దాం కూటమి ప్రభుత్వ మోసాలపై తిరగబడదాం..
రేపల్లె మేజర్ న్యూస్; స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పిటా నాగమోహన్ కృష్ణ సూచించారు సోమవారం రేపల్లె మండలం వైయస్సార్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది ముందుగా దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఇన్చార్జి పిటా మాట్లాడుతూ
జగనన్న 2.0' కార్యక్రమం పార్టీ శ్రేణులందరికీ కొండంత భరోసానిస్తుందని, రాబోయే రోజుల్లో పార్టీలో ప్రతి ఒక్క అడుగు ప్రతి కార్యక్రమం కేవలం కార్యకర్తలు, నాయకుల చేతుల మీదుగానే నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దగా, మోసాలు నయవంచనలను ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఒక సవాల్‌గా తీసుకుని, నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి విజయకేతనం ఎగురవేసేలా ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా కష్టపడి పనిచేయాలని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. వైయస్సార్ పార్టీ నాయకులు గూడపాటి శ్రీనివాసరావు (జి.ఎస్) మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పార్టీ కోసం పనిచేస్తూ స్థానిక సంస్థల్లో అభ్యర్థుల విజయాలకు నిరంతరం కృషి చేయాలని కోరారు. ఎలాంటి తారతమ్యాలు లేకుండా నియోజకవర్గంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా అందిద్దామని కోరారు. మండల కన్వీనర్ మేడికొండ అనిల్ మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులు అనేకమంది ఉన్నారని వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి మండలంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరవేసేందుకు నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బిోర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చిమటా బాలాజీ, రాష్ట్ర పెన్షనర్స్ విభాగం కార్యవర్గ సభ్యులు ఉయ్యూరు సూర్యనారాయణ, మాజీ ఎంపీటీసీ సభ్యులు గొరిగిపూడి మరియదాసు, మోహన్ బాబు, గంగాధర్ రావు,వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.