నిరుద్యోగ మహిళలకు బుట్ట ఫౌండేషన్ అండ దండలు
నిరుద్యోగ మహిళలకు బుట్టా ఫౌండేషన్ అండ దండలు
.. టాటా కంపెనీ లో 40 మందికి కొలువులు
ఎమ్మిగనూరు: సూర్య ప్రతినిధి
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాటా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాకు 70 మంది అభ్యర్థులు హాజరుకాగా, 40 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబనకు ప్రాధాన్యతనిచ్చారు.
ఎంపికైన యువతులు బుట్ట ఫౌండేషన్ అధినేత బుట్ట నీలకంఠకు, మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫస్ట్ స్టెప్ ప్రతినిధి శ్రీ రాజశేఖర్, టాటా ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ హెచ్‌ఆర్ ప్రతినిధులు ఆన్సర్, సమీర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ డి. నజీర్ అహ్మద్, కేఆర్ జయరామ కోటేశ్వర్ రెడ్డి, తిమ్మాపురం బజారి, మహమ్మద్ ఫయాజ్, నరసింహులు, వీరాంజనేయులు, రఘువీర్, వినోద్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.