నకరికల్లు మండలంలో తొలిరోజు 39 సర్పంచ్, 79 వార్డు నామినేషన్లు
నకరికల్లు మేజర్ న్యూస్: పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొత్తం 39 సర్పంచ్ నామినేషన్లు, 79 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. ఇందులో చల్లగుండ్లలో 3 సర్పంచ్, 7 వార్డు సభ్యుల నామినేషన్లు, చీమలమర్రిలో 2 సర్పంచ్ నామినేషన్లు, దేచవరంలో 2 సర్పంచ్ నామినేషన్లు, గుండ్లపల్లిలో 7 సర్పంచ్, 25 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
అదేవిధంగా కండ్లగుంటలో 3 సర్పంచ్, 5 వార్డు సభ్యుల నామినేషన్లు, కుంకలగుంటలో 5 సర్పంచ్ నామినేషన్లు, నరసింగపాడులో 9 సర్పంచ్, 21 వార్డు సభ్యుల నామినేషన్లు, నకరికల్లులో 3 సర్పంచ్, 8 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి.
శివాపురం తండాలో 2 సర్పంచ్, 5 వార్డు సభ్యుల నామినేషన్లు, త్రిపురాపురంలో 3 సర్పంచ్, 8 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీల్లో తొలిరోజు నామినేషన్లు దాఖలు కాలేదు.
మొత్తంగా తొలిరోజు 39 సర్పంచ్, 79 వార్డు సభ్యుల నామినేషన్లు నమోదైనట్లు ఎన్నికల నివేదిక వెల్లడించింది.