-- నాయకులు సమన్వయంతో పనిచేయాలి -- ఎమ్మెల్యే చిర్రి బాలరాజురెబల్స్‌గా బరిలో దిగితే వేటు తప్పదు!
జీలుగుమిల్లి, మేజర్ న్యూస్ :కూటమి ధర్మానికి వ్యతిరేకంగా రెబల్స్ అభ్యర్థులుగా నామినేషన్ వేస్తే పార్టీ నుంచి వేటు తప్పదని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హెచ్చరించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బర్రింకలపాడులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీలుగుమిల్లి మండలానికి చెందిన కూటమి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపించిందని అన్నారు. కూటమిలో అంతర్గత విభేదాలు, వివాదాలు కొనసాగితే అవి ప్రతిపక్షాలకు విజయావకాశాలుగా మారుతాయని హెచ్చరించారు. రానున్న సర్పంచ్ ఎన్నికల్లో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జీలుగుమిల్లి మండలంలోని 12 పంచాయతీలకు జనసేన పార్టీకి 5, తెలుగుదేశం పార్టీకి 6, బీజేపీకి 1 పంచాయతీ స్థానాన్ని కేటాయించినట్లు ఎమ్మెల్యే బాలరాజు తెలిపారు. మూడు పార్టీల నాయకులు సమష్టిగా పనిచేసి కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షులు సుంకవల్లి సాయి, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, బీజేపీ మండల అధ్యక్షులు గుడ్ల రాంబాబు, కూటమి నాయకులు బండారు అనిల్, రూపా సత్యనారాయణ, సూరిశెట్టి మహేష్, గుడపాటి పుల్లయ్య, అజయ్, గారపాటి శ్రీను, ప్రభాకర్, కోలా మధు, శేఖర్, కుంజా రమేష్, పద్దం వెంకటకృష్ణ, యాండ్రా శేఖర్, కూరం వెంకటేష్, జాస్తి సత్యనారాయణ, సిరిబత్తుల స్వామి, గుడెల్లి లక్ష్మీనారాయణ, శొంఠి రామకృష్ణ, కొప్పుల శ్రీకాంత్, సరియం ముత్యాలరావు, జీలుగుల శివ, బండారు సత్యనారాయణ, నెలటూరు మోహన్, నాలి శ్రీను, తోట బాలు, సంకుల రామకృష్ణ, బుద్దా నాగరాజు, సంకురుడు తదితరులు పాల్గొన్నారు.