మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని బొబ్బిలిలో ర్యాలీ
- సిఐటియు
బొబ్బిలి సెప్టెంబర్ 30: మేజర్ న్యూస్:
రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కాంట్రాక్టు, కార్మికులు చనిపోయిన వారి పిల్లలకు ఉద్యోగాలు నియామకాలు చేపట్టాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు వారు మాట్లాడుతూ
12వ పిఆర్సి కమిషన్ వెంటనే వేయాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా డీఏ, ఐ.ఆర్ ఇవ్వాలని డిమాండ్స్ తో రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం వేణుగోపాల స్వామి కోవెల సెంటర్ నుండి బజార్ మీదుగా ఎన్టీఆర్ బొమ్మ సెంటర్ వరకు ప్రదర్శన జరిగింది. దీని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి. శంకర్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన సందర్భంగా మేం అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు కావస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదని అన్నారు. చనిపోయిన, రిటైర్ అయిన కార్మికులకు 1972 గ్రాట్యూటీ ఆక్ట్ ప్రకారం కార్మికులకు గ్రాడ్యుటి చెల్లించాలి.దానిని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అలాగే 75 వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటి వరకు ఆ జీవోలు ఇవ్వడం లేదు. ధరలు ఒక ప్రక్క ఆకాశాన్ని తాకుతున్నాయి జీతాలు మాత్రం పెరగడం లేదు. చనిపోయిన రిటైర్ అయిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఇవ్వడం లేదు. లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వేస్తున్నారని అన్నారు. అక్టోబర్ 2 విజయవాడ అలంకార్ సెంటర్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలతో ఒకరోజు దీక్షలు చేపడతామని అన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి. గౌరీ, జె. రామారావు, బి. యుగంధర్, జి వాసు, మంగళగిరి ప్రసాదు కార్మికులు పాల్గొన్నారు.