మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కనిగిరి ,మేజర్ న్యూస్ :కనిగిరి పట్టణంలో పలు వార్డులలో అభివృద్ధి పనులకు సంభందించి మున్సిపల్ కమీషనర్ పి శ్రీధర్ టీడీపి నాయకులతో కలిసి సోమవారం శంకుస్థాపనలు చేశారు .పట్టణంలోని 2 వార్డు శంఖవరం లో 16 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజి నిర్మాణానికి ,అలాగే 22 వార్డులో 6.75 లక్షల వ్యయంతో చేపడుతున్న డ్రైనేజి నిర్మాణానికి మున్సిపల్ కమీషనర్ పి శ్రీధర్ ,పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్ ,తెలుగు యువత అధ్యక్షులు అచ్చాల రవి టీడీపి నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు .పలు వార్డులలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు .ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో అన్ని వార్డులలో ప్రాధాన్యత క్రమంలో డ్రైనేజి ,సీసీ రహదారులు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో టీడీపి నాయకులు దొడ్డా సురేష్ రెడ్డి ,నీలిశెట్టి అంజి నాయుడు ,షేక్ రహీమాన్ ,బుల్లా బాలబాబు ,ఏనుగు శ్రీను ,సద్గురు మూర్తి ,చీర్ల నాగార్జున యాదవ్ ,సిహెచ్ తిరుపాలు ,పెన్నా కొండలు ,నజీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు .