BREAKING
వివిధ పుష్పాలతో విశేష అలంకరణలో సిద్ధి గణపతి వరద రాకముందే.. మన్యంలో కాపలా! సీనియర్ సిటిజన్లకు నామినేషన్ల ఆహ్వానం అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం – 2026 'మై భారత్' ద్వారా వికసిత్ భారత్ 2047 లక్ష్యం సులభ్ కాంప్లెక్స్ లను తనిఖీ చేసిన మున్సిపల్ కమీషనర్. తీరంలో అలజడి..మన్యంలో వాగుల ఉదృతి ఆహా.. అనిపిస్తున్న పాలకొండ జలపాతాలు మంగపేట నూతన డీటీగా షాపూర్ రాజేందర్ కోనసీమ జిల్లాలో వినాయక ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత: మరణాయుధాలతో పరస్పర దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు రూ.100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ షీ జిన్‌పింగ్‌తో భేటీలో మతస్వేచ్ఛ, అమెరికన్ల నిర్బంధంపై నిలదీయండి: ట్రంప్‌కు యూఎస్ సెనేటర్ టెడ్ బడ్ విజ్ఞప్తి పసిఫిక్ దీవుల అభివృద్ధికి భారత్ ప్రత్యేక సామర్థ్య పెంపు శిక్షణ హుజురాబాద్ డివిజన్లో భారీ వర్షం యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర బస్సు ప్రమాదం ఈనెల 30న సిరిసిల్లలో లక్ష మందితో సీఎం రేవంత్ రెడ్డి సభ

ముంపు ప్రాంతాల్లో.. కాకినాడ కమీషనర్

Select Suryaa Now
ముంపు ప్రాంతాల్లో.. కాకినాడ కమీషనర్

వానలో కాకినాడ.. వీధుల్లో కమిషనర్

ముంపు ప్రాంతాలకు బైక్‌పై వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన

ఇళ్ల చుట్టూ చేరిన నీటిని స్వయంగా పరిశీలించిన సత్యనారాయణ

మోటార్లు, పంపులతో నీటి తొలగింపు.. ఎనిమిది సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

కాకినాడ: భారీ వర్షాలతో కాకినాడలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో నగరపాలక సంస్థ యంత్రాంగం క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగింది. కమిషనర్ ఎన్‌.వి.వి. సత్యనారాయణ స్వయంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షం కురుస్తున్నా గొడుగు పట్టుకుని నీటిలో నడుస్తూ పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న ప్రాంతాల్లో బైక్‌పై వెళ్లారు. ఇళ్ల చుట్టూ చేరిన నీటిని స్వయంగా చూసి, ఎక్కడికక్కడ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

బాపూజీనగర్‌లో బైక్‌పై..

జగన్నాథపురం, పద్మనాభనగర్, బాపూజీనగర్ తదితర లోతట్టు ప్రాంతాలను గురువారం కమిషనర్ పరిశీలించారు. బాపూజీనగర్‌లో వీధుల్లో నీరు చేరడంతో బైక్‌పై లోపలికి వెళ్లారు. స్థానికుల ఇళ్ల వద్ద పరిస్థితిని పరిశీలించి నీరు ఎంతవరకు చేరింది, బయటకు వెళ్లేందుకు ఎక్కడ ఆటంకం ఉందన్నది అధికారులతో సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణమే నీటిని తొలగించాలని ఆదేశించారు.

మోటార్లు పెట్టి నీటి తొలగింపు

వర్షపు నీరు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లు, పంపులు ఏర్పాటు చేసి బయటకు పంపుతున్నారు. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త, మట్టి, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చర్యలు చేపట్టారు. మెయిన్‌రోడ్, మార్కెట్ వీధి, నూకాలమ్మ గుడి రోడ్డు, రెవెన్యూ గెస్ట్‌హౌస్ రోడ్డు, ఆర్టీవో కార్యాలయం కూడలి పరిసరాల్లోనూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఎనిమిది ప్రాంతాలపై ప్రత్యేక నిఘా

కాకినాడలో ముంపు సమస్య తలెత్తే అవకాశం ఉన్న సుమారు ఎనిమిది ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక దృష్టి పెట్టారు. భారీ వర్షాలకు చెట్లు విరిగిపడటం, విద్యుత్ వైర్లు తెగడం, రహదారులకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉండటంతో సంబంధిత విభాగాలను అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచారు.

క్షేత్రం నుంచే సమన్వయం

అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు ఇంజినీరింగ్, విద్యుత్, పారిశుధ్య విభాగాల సిబ్బందితో కమిషనర్ సమన్వయం చేస్తున్నారు. సమస్యపై సమాచారం అందిన వెంటనే అందుబాటులో ఉన్న వనరులతో పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముంపు సమస్యపై సమాచారం అందిన వెంటనే నగరపాలక సంస్థ స్పందిస్తుందని సత్యనారాయణ భరోసా ఇచ్చారు.

కమిషనర్ వెంట హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వి చరణ్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, ఇంజినీరింగ్ అధికారులు పర్యటించారు.