BREAKING
వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి.. ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు

Select Suryaa Now
ముఖ్యమంత్రి  పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు

రేపు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించిన జిల్లా ఎస్పీ*

పటిష్ట బందోబస్తు నిర్వహణపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ .

9వ తేదీన మీ భూమి - మీ హక్కు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు గ్రామానికి రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ బందోబస్తు విధుల్లో పాల్గొనబోయే పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించి బందోబస్తు విధులపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ప్రతి సెక్టార్‌కు తగినంత సంఖ్యలో సిబ్బందిని కేటాయించినట్లు తెలిపారు. విధులకు నియమించబడిన అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన పాయింట్ల వద్ద నిర్ణీత సమయానికి హాజరై ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యే వరకు పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకల సమయంలో సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా అవసరమైన చోట ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని సూచించారు. సభా ప్రాంగణానికి వచ్చే వీవీఐపీ, వీఐపీ వాహనాలను నిర్దేశించిన పార్కింగ్ స్థలాలకు మళ్లించేలా చర్యలు తీసుకోవాలని, ఇతర వాహనాలు కూడా కేటాయించిన ప్రదేశాల్లో క్రమబద్ధంగా పార్కింగ్ చేయించేలా చూడాలని తెలిపారు. ప్రజలు మరియు కార్యకర్తల ప్రవేశ, నిష్క్రమణను క్రమబద్ధంగా నిర్వహించాలని, సెక్టార్ ఇన్‌చార్జ్ అధికారులు తమ పరిధిలోని సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. భద్రతా పరంగా ఎలాంటి లోపాలు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట రోప్ పార్టీలు, రూప్ టాప్, స్పెషల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. హెలిప్యాడ్ ప్రాంతం నుంచి రచ్చబండ, ప్రజావేదిక, అనంతరం పార్టీ కార్యకర్తలతో సమావేశం వరకు ముఖ్యమంత్రి పర్యటన ప్రారంభం నుంచి ముగిసే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా, డ్రోన్‌ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగించేలా కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విధులు నిర్వహించే సిబ్బంది సమయస్పూర్తితో వ్యవహరించాలన్నారు. అనంతరం నర్సింగోలు వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగే హెలిప్యాడ్ ప్రాంతం నుండి రచ్చబండ కార్యక్రమం, ప్రజావేదిక మరియు కాన్వాయ్ ట్రయల్ రన్ ను ప్రత్యేకంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వచ్చేటప్పుడు బందోబస్త్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉండాలని, కాన్వాయ్ వెళ్లే మార్గంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.

*పటిష్ట భద్రతా ఏర్పాట్లు* 

ముఖ్యమంత్రి పర్యటన భద్రత కోసం జిల్లా ఎస్పీ గారి స్వీయ పర్యవేక్షణలో ముగ్గురు అదనపు ఎస్పీలు, 6 మంది డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులతో కలిపి సుమారు 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రోప్ పార్టీలు, స్పెషల్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్ ను మోహరించి పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.