BREAKING
13 మంది పిల్లల పెంపకంపై ఎలాన్ మస్క్ కీలక స్పష్టత: ఎంతమంది సిబ్బంది ఉంటారంటే? అబుదాబిలో భారతీయ చేనేత వస్త్ర వైభవాన్ని చాటిన ఎంబసీ! 118 ఏళ్ల చరిత్ర కలిగిన పెన్స్ కేవ్ అమ్మకానికి: అమెరికాలో 1400 ఎకరాల వింత ప్రాపర్టీ వాయుసేన నూతన వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా దర్శి నియోజకవర్గం లోని కూటమి జడ్పీటీసీ అభ్యర్థుల విజయం తద్యం. __Dr. గొట్టిపాటి లక్ష్మీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహారాష్ట్ర, హర్యానా పర్యటన వారణాసి-న్యూఢిల్లీ మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం శ్రీలంక మత్స్య రంగానికి భారత్ 430 ఎలక్ట్రిక్ మోటార్ బైక్‌ల అందజేతకు ఒప్పందం! కమలం గుర్తుకు ఓటెయ్యండి - బిజెపి నేత కోలా ఆనంద్ ప్రతిష్టాత్మక 'ఏబీయూ బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్' అవార్డు కైవసం! జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డు తరలింపునకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. నిధులు తెచ్చే బాధ్యత నాది: ఎంపీ ఈటల రాజేందర్‌ ఏలూరు నగర అభివృద్ధికై బ్లాక్ బోర్డు గుర్తుకు ఓటెయ్యండి టిడిపి, జనసేన, బిజెపి పార్టీల అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలి -- విలేకరుల సమావేశంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు సేవ గుణం. చాటుకున్న ఉపాధ్యాయుడు. తన జీతం డబ్బులతో ముప్పై వేల రూపాయలు పిల్లలకు వైట్ డ్రస్ లు.

ముగిసిన బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
ముగిసిన బొబ్బిలి మున్సిపల్ ఎన్నికల ప్రచారం

బొబ్బిలి, సూర్య్ : బొబ్బిలి పురపాలక సంఘ ఎన్నికల ప్రచారం నేడు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సి ఉండగా, నేడు సాయంత్రం 5 గంటల తర్వాత ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని అధికారులు స్పష్టం చేశారు. ఈ గడువు తర్వాత బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింటి ప్రచారం, లౌడ్ స్పీకర్ల వినియోగం, సోషల్ మీడియాలో ప్రచారం వంటివి పూర్తిగా నిషేధించబడ్డాయని పట్టణ సిఐ కె నారాయణ తెలిపారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు:

నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం నిర్వహించే వారిపై, ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పట్టణంలోని అన్ని వార్డుల్లో నిరంతరం నిఘా ఉంచుతున్నాయని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.