BREAKING
చింతలపూడి నగర పంచాయతీ ఓటర్ల జాబితా పంపిణీ కూటమి అభ్యర్థులను గెలిపించండి -మంత్రి పార్థసారథి మేయర్ అభ్యర్థి తో పాటు కార్పొరేటర్లందరినీ గెలిపించుకోవాలి... జంగారెడ్డిగూడెంలో వైసీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం, మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం - లారీ ఢీకొని యువకుడు మృతి కూటమి ధర్మాన్ని పాటించి న్యాయం చేయండి ప్రజల ఎదుర్కొన ప్రత సమస్యకు భరోసాగా నిలుస్తాం .. ఎర్రకోట రాజీవ్ రెడ్డి రూరల్ మండలంలో కూటమి విజయానికి సమష్టిగా కృషి చేయాలి: తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి రూరల్ మండల నాయకులతో కీలక భేటీ అభివృద్ధి చేశాం,మరో అవకాశం ఇవ్వండి : వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు ఎస్.ఏ.కరీముల్లా,షేక్ షబానా విజ్ఞప్తి ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి లక్ష్యం -22ఏ, టీడీఆర్ బాండ్ల సమస్యకు 100 శాతం పరిష్కారం చూపిస్తాం -1000 మంది ఓటర్ల ఆత్మీయ సమావేశంలో 52వ డివిజన్ ఎన్డీఏ కూటమి కార్పొరేటర్ అభ్యర్థి గుడిపల్లి పృథ్వి హామీ ఈరోజు మా తాడేపల్లిగూడెం కి ఏనుగు వచ్చిందని మీకు తెలుసా జడ్పీ చైర్మన్ కాంగ్రెస్ అభ్యర్థి గా ప్రియాంక ఇంజనీర్ కౌన్సిలరైన వేళ. భీమవరంలో నారాయణ స్కాలర్‌షిప్ పరీక్షను అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ ఇతర విద్యాసంస్థల విద్యార్థులను ప్రలోభపెట్టి అడ్మిషన్లు కల్పించే ప్రయత్నాలను సహించం భీమవరం, మేజర్ న్యూస్: భీమవరం పట్టణంలోని గునుపూడి ప్రాంతంలో నారాయణ విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఎన్‌సెట్ స్కాలర్‌షిప్ పరీక్షను ఎస్‌ఎఫ్‌ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన కూరగాయల సాగుతో రైతులకు అధిక ఆదాయం పంట మార్పిడిని ప్రోత్సహిస్తున్న  ప్రభుత్వం *ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

మూడవ వార్డు ఎస్టీ కాలానీవాసులు కూటమికి మద్దతు

Select Suryaa Now
మూడవ వార్డు ఎస్టీ కాలానీవాసులు కూటమికి మద్దతు

*మూడో వార్డు ఎస్టీ కాలనీవాసులు కూటమికి మద్దతు*

ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమ వెంకటసుబ్బయ్య 

 : ఆత్మకూరు మున్సిపాలిటీలోని మూడో వార్డు మోడల్ ఎస్టీ కాలనీలో ఆదివారం తెలుగుదేశం యువనేత, మున్సిపల్ టిడిపి ఛైర్పర్సన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తనయుడు బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, కుటుంబాలు పెరగడంతో కొత్త గృహాలు ఏర్పాటు చేయాలని స్థానికులు ఆయనను కోరారు.
ప్రజల సమస్యలపై సానుకూలంగా స్పందించిన బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ, తమ కాలనీ ఏర్పాటు చేసింది మీరేనని,మాకు గృహాలు కల్పించింది మీరేనని,ఇప్పటివరకు మా సమస్యలను పరిష్కరిస్తున్నది మీరే. మా కాలనీలో ఉన్న సమస్యలను కూడా మీరే పరిష్కరించాలి. మా ఓటు మీకే” అంటూ తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ముందుకు సాగుతోందని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా గారిని, మూడో వార్డు కూటమి అభ్యర్థి నలిసెట్టి సీనయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.
కాలనీలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని బొమ్మిరెడ్డి తారకనాథ్ రెడ్డి చేసిన విజ్ఞప్తితో ప్రచార కార్యక్రమం కొనసాగింది.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాక్గొన్నారు.