మీకు సేవకుడిగా పని చేస్తా.. ఆదరించండి.. టిడిపి 39 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనా
తనకు పేరు ప్రఖ్యాతలు ముఖ్యం కాద ని.. మీకు సేవకుడిగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని తెలుగుదేశం పార్టీ 39వ వార్డు కౌన్సి లర్ అభ్యర్థి తాతాశీనా ( శ్రీనివాసులు) అన్నారు. ఆదివారం 39వ వార్డు పరిధిలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రచార కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చిన తాతాశీనా వార్డులోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూల మాలలు వేసి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కౌన్సిలర్ గా గెలిపిం చాలని, అలాగే మరో ఓటును చైర్మన్ అభ్యర్థి అర్షియా భాను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి తాతాశీనా మాట్లాడుతూ తాను గతంలో సైతం కౌన్సిలర్ గా పనిచేశానని, ఆ సమయంలో వార్డు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సమస్య తీర్చడం జరిగిందన్నారు. ప్రధానంగా వార్డులో తాగునీటి సమస్య నెలకొంటే తన సొంత నిధులు వెచ్చించి బోర్ వేయించి వార్డు మొత్తం పైప్లైన్ ఏర్పాటు చేసి నీటి సమస్య తీర్చడం జరిగిందన్నారు. ప్రతి వీధిలోను విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. మరోసారి గెలిపిం చాలని ఓటర్లను అభ్యర్థించారు. తనకు పదవుల అంటే వార్డు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ముఖ్యమని తెలియజేశారు. మరోసారి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డును కదిరి మున్సిపాలిటీ లోనే ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దు తానని వివరించారు. ఈ కార్యక్రమంలో 38 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మల మహమ్మద్ అత హర్, 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి విజయ్ కుమార్, టిడిపి నాయకులు మస్తాన్, నాగ, అభిమానులు పాల్గొన్నారు.