BREAKING
"అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం గాజాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న హింస కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్ విద్యుత్ షాక్ తో రైతు మృతి అమరజీవి త్యాగం చిరస్మరణీయం: గాదంశెట్టి వేణుగోపాల్ ​ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ​పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి. చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. యువత స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందాలి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన? - ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

మనుబోలు మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న సైకిల్ స్పీడ్

Select Suryaa Now
మనుబోలు మండలంలో రోజురోజుకూ పెరుగుతున్న సైకిల్ స్పీడ్

నెల్లూరు, మేజర్ న్యూస్  : మనుబోలు మండలంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పెరుగుతోందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికల వేళ జట్లకొండూరు పంచాయతీకి చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా 19 కుటుంబాల వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.  నెల్లూరు వేదాయపాళెంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈపూరు నవీన్, బోయిన ఆదినారాయణ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.  టీడీపీలో చేరిన వారిలో కిర్లా వెంకటేష్, ఆమవరపు మణిదీప్, శ్యామ్, వినోద్, కె. పెంచలయ్య, కె. మల్లికార్జున, కె. సుబ్రహ్మణ్యం, ఎన్. రామయ్య, కె. సునీల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాయకత్వంలోనే మనుబోలు మండలంలో అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ చేరికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.