మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
మహిళా రిజర్వేషన్ బిల్లుకు చట్టసభల్లో సముచిత స్థానం కల్పించాలి
ఎమ్మిగనూరు: సూర్య ప్రతినిధి
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో త్వరితగతిన ఆమోదించి అమలు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పి. శ్రావణి డిమాండ్ చేశారు. ఎమ్మిగనూరు సీపీఐ కార్యాలయంలో మహిళా సమాఖ్య పట్టణ జనరల్ బాడీ సమావేశం యు. ఈరమ్మ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంతో పాటు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. మహిళలు, విద్యార్థినులపై దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పేద, వితంతు, ఒంటరి మహిళలకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం పట్టణ మహిళా సమాఖ్య నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా వాణి, కార్యదర్శిగా ఈరమ్మ, ఉపాధ్యక్షులుగా రేణుక, వెంకటలక్ష్మి, సరోజ, సహాయ కార్యదర్శులుగా చామంతి, ముసిర బేగం, నాగలక్ష్మి ఎన్నికయ్యారు. మరో 20 మందిని పట్టణ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.