BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

మహేంద్ర తనయ ఉద్ధృతి.. రహదారులపైకి వరద నీరు

Select Suryaa Now
మహేంద్ర తనయ ఉద్ధృతి.. రహదారులపైకి వరద నీరు

 

కోసమాల వద్ద నాలుగు అడుగుల మేర ప్రవాహం.. రాకపోకల నియంత్రణకు బారికేడ్లు

మెళియాపుట్టి. అక్టోబర్ 29. మేజర్ న్యూస్.
ఆర్నబ్ తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు మెళియాపుట్టి మండలంలో మహేంద్ర తనయ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కోసమాల, రట్టిని గ్రామాల సమీపంలో నది నీటిమట్టం పెరగడంతో రహదారులపైకి వరద నీరు చేరింది. కోసమాల వద్ద రహదారిపై సుమారు నాలుగు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండగా, రట్టిని వద్ద కూడా రహదారిపైకి నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల నివారణకు అధికారులు అప్రమత్తమయ్యారు. కోసమాల, రట్టిని గ్రామాల వద్ద రహదారులకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనదారులు, ప్రజలు వరద నీటిని దాటి వెళ్లకుండా రాకపోకలను నియంత్రించేందుకు రెండు ప్రాంతాల్లో వీఆర్వోలు, వీఆర్ఏలు, పోలీసు సిబ్బందిని నియమించారు. నది ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా రహదారులపై వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలలో ప్రయాణం చేయకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు
పరిస్థితిని సీఐ వెంకటరావు, తహసీల్దార్ రాము, ఎంపీడీవో పి.నరసింహప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో బి.అప్పయ్య, ఎస్సై ఆలీతో పాటు  అధికారులు పర్యవేక్షిస్తున్నారు