మహనీయుల ఆశయాలు నేటి తరానికి ఆదర్శం
ముండ్లమూరు మేజర్ న్యూస్.;జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ముండ్లమూరులో మహాత్మ గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్బంగా టిడిపి నేత బేతపూడి రామారావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి మార్గాలతో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచారని అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో చూపాలని పిలుపునిచ్చారు. దేశానికి “జై జవాన్–జై కిసాన్” నినాదాన్ని అందించిన లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయతీ, ధైర్యం, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. అధికారం అంటే హోదా కాదని, ప్రజలకు సేవ చేసే బాధ్యత అని శాస్త్రి తన జీవితంతోనిరూపించారని తెలిపారు. “ప్రస్తుత రాజకీయాల్లో గాంధీజీ సత్యనిష్ఠ, శాస్త్రిజీ నిరాడంబరత అత్యంత అవసరం అని పేర్కొన్నారు. యువత మహనీయుల జీవిత చరిత్రలను అధ్యయనం చేసి, క్రమశిక్షణ, నిజాయతీ, సేవాభావం, దేశభక్తిని అలవరచుకోవాలని సూచించారు.