BREAKING
దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు సర్పంచ్ ఎన్నికల వేడి.. సీట్ల కోసం కూటమిలో కుమ్ములాటలు! ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సీనియర్ నటుడు, దర్శకుడు టిన్ను ఆనంద్.. ఆరోగ్యంపై అప్‌డేట్ నాకు నచ్చిన పాత్రలు దొరకడం ఇప్పటికీ సవాలే.. సరైన అవకాశం కోసం వేచి చూస్తా: అదితి రావు హైదరి పోటీ నుంచి తప్పుకున్న రాంజీ యశ్ రాజ్ ఫిల్మ్స్ తొలి హారర్ చిత్రంలో వరుణ్ ధావన్.. దర్శకత్వం ఎవరిదంటే? రెండు ద్విచక్ర వాహనాలు డి... ఒకరు మృతి న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు గుర్నూర్ బ్రార్ ఎంపిక.. కుల్దీప్ యాదవ్‌పై బీసీసీఐ కీలక నిర్ణయం సాండ్‌పేపర్ వివాదంపై డేవిడ్ వార్నర్ సంచలన ఆరోపణలు.. స్టార్క్, లయన్, హేజిల్‌వుడ్‌లను విచారించలేదంటూ క్రికెట్ ఆస్ట్రేలియాపై ఫైర్ 10వ తరగతి ఫలితాలు పై ప్రత్యేక దృష్టి టీ20 ఫార్మాట్‌లో వ్యూహాత్మక మార్పులే కీలకం.. కర్ణాటక యువ బ్యాటర్ స్మరన్ రవిచంద్రన్ ఆసక్తికర వ్యాఖ్యలు దివ్య కుటుంబానికి అండగా ఉంగుటూరు ఎమ్మెల్యే, జనసేన నాయకులు యాదవోలులో కేంద్ర బృందం పర్యటన

మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు

Select Suryaa Now
మధుమేహ నియంత్రణకు ముందస్తు పరీక్షలే కీలకం: నారాయణ వైద్యులు

నెల్లూరు కల్చరల్, మేజర్ న్యూస్ :   ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో శనివారం మధుమేహ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు మధుమేహ నివారణ, ముందస్తు గుర్తింపు, చికిత్సా విధానాలు, తలెత్తే ఆరోగ్య సమస్యలపై వివరించారు. కార్యక్రమంలో భాగంగా నారాయణ కాంప్రహెన్సివ్ డయాబెటిస్ కేర్ ప్యాకేజీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్. ప్రభావతి మాట్లాడుతూ మధుమేహాన్ని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. సమగ్ర మధుమేహ పరీక్షల ప్యాకేజీలో ఈసీజీ, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, కిడ్నీ పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, యూరిన్ మైక్రో ఆల్బుమిన్ , బీపీ, బాడీ మాస్ ఇండెక్స్ , పాదాల పరీక్ష, నరాల పనితీరు, హెచ్బిఎ1సి,  ఏబీపిఐ పరీక్షలతో పాటు వైద్య నిపుణుల సంప్రదింపు సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ టి. సునంద మాట్లాడుతూ 2026 ప్రపంచ మధుమేహ దినోత్సవ థీమ్ మధుమేహంపై ముందస్తు చర్యలు అని వెల్లడించారు. అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, ఆకలి పెరగడం, అలసట, బరువు తగ్గడం, చూపు మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ జెడ్. సిద్ధునిఖిత్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా షుగర్ పరీక్షలు చేయించుకోవడం, వైద్యులు సూచించిన మందులు వాడటం, వ్యాయామం, ఆహార నియమాలు పాటించడం ద్వారా మధుమేహాన్ని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని చెప్పారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ వి. మహీధర్ రెడ్డి మాట్లాడుతూ మధుమేహ బాధితుల్లో పాదాలకు గాయాలైతే త్వరగా మానకపోవడం, ఇన్ఫెక్షన్లు రావడం వంటి సమస్యలు ఉంటాయని, రోజూ పాదాలను పరిశీలించుకోవాలని సూచించారు.
జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ చంద్రబాబు మాట్లాడుతూ మధుమేహం దీర్ఘకాలం నియంత్రణలో లేకపోతే గుండె, మూత్రపిండాలు, కళ్ళు, నరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. డైటీషియన్ ఎం. పద్మజ మదన్ మాట్లాడుతూ మధుమేహ బాధితులు సమతుల ఆహారం తీసుకోవాలని, చక్కెర పదార్థాలు, అధిక కేలరీల ఆహారాన్ని పరిమితం చేయాలని సూచించారు.
నారాయణ కాంప్రహెన్సివ్ డయాబెటిస్ కేర్ ప్యాకేజీ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 14, 2026 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఎ.సి. శేఖర్ రెడ్డి, వివిధ విభాగాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.