మదనపల్లిలో టిడిపి ముఖ్య నేతల ఆత్మీయ కలయిక : సుగవాసి ప్రసాద్ బాబు,జి.శంకర్ యాదవ్,శ్రీరామ్ చినబాబుల భేటీ
మదనపల్లె,మేజర్ న్యూస్ : అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి పట్టణం సొసైటీ కాలనీలోని తంబళ్లపల్లె నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ జి.శంకర్ యాదవ్ కార్యాలయంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు,మదనపల్లె మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.ఇందులో భాగంగా రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును సైతం ఆయన కలిశారు.ఈ భేటీలో పార్టీ బలోపేతం,స్థానిక రాజకీయ పరిణామాలు,భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన అంశాలపై నాయకులు కొద్దిసేపు చర్చించుకున్నారు.త్వరలో జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో తంబళ్లపల్లి,మదనపల్లి నియోజకవర్గాల్లో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఆలోచనలు చేశారు.ఈ కార్యక్రమంలో గంగారపు రామ్మూర్తి నాయుడు,34 వార్డు కౌన్సిలర్ బోయపాటి రంగస్వామి నాయుడు,టౌన్ బ్యాంక్ డైరెక్టర్ జోలపాళ్యం దేవేంద్ర,నాదెళ్ల అరుణ్ తేజ,యాళగిరి దొరస్వామి నాయుడు,మల్లెం ప్రకాష్ నాయుడు,మండ్యం ప్రభాకర్,కలిశం ప్రకాష్ నాయుడు,కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్