మదనపల్లె మున్సిపాలిటీలో బీసీలకే అత్యధిక సీట్లు!
మదనపల్లె మున్సిపాలిటీలో బీసీలకే అత్యధిక సీట్లు!
చైర్మన్ పదవి బీసీ జనరల్‌కు కేటాయింపు.. 48 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు
మదనపల్లె, అన్నమయ్య జిల్లా:
మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 48 వార్డులకు రిజర్వేషన్లను ప్రకటించారు.
రిజర్వేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్టీ జనరల్‌కు 1 వార్డు, ఎస్సీ జనరల్‌కు 2, ఎస్సీ మహిళకు 1, బీసీ జనరల్‌కు 10, బీసీ మహిళకు 10, జనరల్ మహిళకు 13, జనరల్‌కు 11 వార్డులు కేటాయించారు. ఎస్టీ మహిళకు ఎలాంటి వార్డు కేటాయించలేదు.
మొత్తం 48 వార్డుల్లో బీసీలకు 20 వార్డులు కేటాయించడంతో అత్యధిక ప్రాతినిధ్యం లభించింది. చైర్మన్ పదవి సైతం బీసీ జనరల్‌కు కేటాయించడంతో మదనపల్లె మున్సిపల్ రాజకీయాల్లో రిజర్వేషన్లు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రిజర్వేషన్ల ఖరారుతో మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
సి శ్రీనివాసులు సూర్య స్టాఫ్ రిపోర్టర్ మదనపల్లి