మాజీ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ నూతన ఎంపీటీసీలు
గరుగుబిల్లి, సూర్య : ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన ఎంపీటీసీ సభ్యులు కురుపాం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్య మంత్రి పాముల పుష్పశ్రీవాణిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాగూరు ఎంపీటీసీ సభ్యులు కేతిరెడ్డి శిరీష,గరుగుబిల్లి ఎంపీటీసీ సభ్యులు తెర్లి ఎల్లంనాయుడు, గొట్టివలస ఎంపీటీసీ సభ్యులు వెలమల సంధ్యలు మాజీ ఎమ్మెల్యేకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.తమ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు మరి యు తమను ఆశీర్వదించిన ప్రజలకు ఈసందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈసందర్భoగా ఎంపీటీసీ లుగా విజయం సాధించిన అభ్యర్థుల కు మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.అనంతరం మాజీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని పిలుపునిచ్చా రు.గ్రామాల్లో నెలకొన్న స్థానిక సమ స్యల పరిష్కారానికి మొదటి ప్రాధా న్యత ఇవ్వాలని సూచించారు.పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడంలో తాము ఎప్పుడూ ముందుంటామని, నూతన ఎంపీటీసీల పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధికి తన వంతు సహకారం, సలహాలు ఎల్లప్పు డూ ఉంటాయని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో నూతన ఎంపీటీసీల తో పాటు మండల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు, పార్టీ ముఖ్య నాయకులు బోను సుధా కరరావు,తెర్లి వసంతకుమార్,మర్రాపు శ్రీనివాసరావు,బొబ్బిలి వెంకటదామో దరరావు,గంట సింహాచలంనాయుడు, మర్రాపు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.