BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ప్యారడైజ్ సంచలనం.. ఆరో రోజులోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగు  పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ సూరి మండడి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగింపు..ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం.. ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే సంబంధిత కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి ఆర్ డి ఓ కు వైఎస్ఆర్సిపి నేతలు వినతి ఫహద్ ఫాజిల్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చ.. భార్య నజ్రియా వయసుపై వివాదం రాయలసీమకు హార్టికల్చర్ హబ్ ఓ గేమ్ చేంజెర్ బీటెక్ రవి

మాచినేనిపాలెంలో విద్యుత్ కేబుల్ సమస్యకు పరిష్కారం.

Select Suryaa Now
మాచినేనిపాలెంలో విద్యుత్ కేబుల్ సమస్యకు పరిష్కారం.

వత్సవాయి మేజర్ న్యూస్ :- మండలంలోని మాచినేనిపాలెం గ్రామ ఎస్సీ కాలనీలో గత ఆరు, ఏడు సంవత్సరాలుగా విద్యుత్ కేబుల్ దెబ్బతినడంతో వర్షాకాలంలో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎట్టకేలకు ఈ సమస్యకు విద్యుత్ శాఖ అధికారులు పరిష్కారం చూపారు.ఎస్సీ కాలనీలో కేబుల్ దెబ్బతిన్న విషయాన్ని పాపగంటి ఆశీర్వాదం పలుమార్లు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే సమస్య పరిష్కారం కాకపోవడంతో పిజిఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పిజిఆర్ఎస్ ఫిర్యాదుపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిశీలించారు.జగ్గయ్యపేట విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాసరావు ఫిర్యాదును పరిశీలించి మాచినేనిపాలెం గ్రామానికి సుమారు రెండు కిలోమీటర్ల కొత్త కేబుల్‌ను మంజూరు చేయించారు. అనంతరం కేబుల్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించారు.వర్షాకాలంలో కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా లైన్‌మ్యాన్ రాంబాబు, జేఎల్‌ఎం షరీఫ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. దీంతో ఎస్సీ కాలనీ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. గత ఆరు, ఏడు సంవత్సరాలుగా కేబుల్ దెబ్బతినడంతో వర్షాకాలంలో ముఖ్యంగా రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పిజిఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేసి పరిష్కారం చూపించినందుకు విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు కాకాని సురేష్‌బాబు, పాపగంటి ఆశీర్వాదం, పోలేపల్లి మురళి, కాకాని క్రాంతికుమార్, విద్యా కమిటీ వైస్ చైర్మన్ ధనకొండ నరసయ్య, పల్లికంటి ఆదం, గద్దల సుక్కయ్య తదితరులు పాల్గొన్నారు.