లబ్ధిదారు కుటుంబానికి 10 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి చేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర…
సీతానగరం అక్టోబర్ 9 మేజర్ న్యూస్:
పార్వతీపురం నియోజకవర్గం సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన అలమండ సతీష్, మహాలక్ష్మి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర 10 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేశారు. ఆ గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళకు కవల పిల్లలు జన్మించి, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఒక బిడ్డ మృతి చెందారు. మరో బిడ్డ ఆరోగ్య ఖర్చులకోసం దాదాపు 28 లక్షలు ఖర్చుపెట్టి బతికించుకున్నారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సమస్యల గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 లక్షలు చెక్కును మంజూరు చేయించారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే విజయచంద్ర స్వయంగా ఈ ఇప్పలవలస గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సీఎం చంద్రబాబు ప్రతి నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని వెల్లడించారు. ఒక పార్వతీపురం నియోజకవర్గానికి సుమారు నాలుగు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారని వివరించారు. గత వైసిపి హాయంలో జగన్మోహన్ రెడ్డి కనీసం లక్ష రూపాయలు కూడా ఏ ఒక్క పేద కుటుంబానికి అందించలేదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రౌతు వేణుగోపాల్ నాయుడు. వెంకట్ నాయుడు. ఉడవల సూర్యనారాయణ. పైల నాగభూషణం. గుణుపూర్ అన్నమనాయుడు. తోట రామారావు తో పాటు పలువురు పాల్గొనడం జరిగింది.