లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ నిర్వహించిన జేసి
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : జిల్లాలో 23 ఏ4 మద్యం దుకాణాలకు డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా లైసెన్సుల ఎంపిక 2026–27 ఎక్సైజ్ పాలసీ ప్రకారం పునరుద్ధరణ కాని, పనిచేయని ఏ4 మద్యం దుకాణాల డిస్పోజల్‌లో భాగంగా 23 ఏ4 మద్యం దుకాణాలకు డ్రా ఆఫ్ లాట్స్ ప్రక్రియ ద్వారా లైసెన్సుల ఎంపికను గురువారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్, ఎం వెంకటేశ్వర్లు ఈ డ్రా ఆఫ్ లాట్స్ ప్రక్రియను నిర్వహించారు. నిబంధనల ప్రకారం అర్హత సాధించిన దరఖాస్తుదారుల మధ్య పారదర్శకంగా డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించగా, ఎంపికకు తీసుకున్న మొత్తం 23 ఏ4 మద్యం దుకాణాలకు విజయవంతంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. స్టేషన్ వారీగా డ్రా ఆఫ్ లాట్స్‌కు తీసుకున్న ఏ4 మద్యం దుకాణాల వివరాలు ఇలా ఉన్నాయి: నెల్లూరు–I ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 3, కావలిలో 2, కోవూరులో 4, ఉదయగిరిలో 5, కలిగిరిలో 1, ఇందుకూరుపేటలో 1, ఆత్మకూరులో 4, గూడూరులో 3 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 23 దుకాణాలకు డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించారు.
డ్రా ఆఫ్ లాట్స్ ప్రక్రియ అనంతరం ఎంపికైన విజయవంతమైన అభ్యర్థులందరికీ ఎంపిక సమాచార పత్రాలను అక్కడికక్కడే అందజేశారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా మొత్తం ఎంపిక ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ. శ్రీనివాసులు నాయుడు తెలిపారు.