కుదరవల్లిలో టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన 20 కుటుంబాలు
గుడివాడ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ కృష్ణా జిల్లా నందివాడ మండలం కుదరవల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 20 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి కొడాలి నాని సమక్షంలో వారు వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని కొత్తగా పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించారు. రాజమహేంద్రపు నాగరాజు, కటికల ప్రసాదు, ఏపూరి ఏలియా, కాటా ప్రసాద్, కటికల పృథ్వీరాజ్, నున్న వెంకట సుబ్బారావు, మాచిన సూర్యనారాయణ, కళ్యాణ్ రామదాసుతో పాటు పలువురు స్థానిక కార్యకర్తలు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ నాయకత్వంపై ప్రజలు, కార్యకర్తల్లో నమ్మకం తగ్గుతోందని విమర్శించారు. కుదరవల్లిలో 20 కుటుంబాలు వైసీపీలో చేరడం తమ పార్టీకి బలాన్నిస్తుందని, రానున్న ఎన్నికల్లో ప్రజల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నందివాడ మండల వైసీపీ అధ్యక్షుడు పెయ్యాల ఆదం, కందుల నాగరాజు, మెరుగుమాల కాళీ, తోట నాగరాజు, కందుల దుర్గాభవాని, గుజ్జల లాజర్, గొర్ల శ్రీను, కోటే అజయ్, బండి కోటి బాబు, గొర్ల హరిబాబు, గొర్ల శంకరరావు, వసంత కృష్ణ తదితర గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, గుడివాడ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.