కొత్తవలసలో భారీ అన్న సమారాధనలు.
కొత్తవలస. సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్:- మండలంలోని పలు ప్రాంతాలలో వరసిద్ధి వినాయకుడు నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా బుధవారం మధ్యాహ్నం భారీ అన్న సమారాధనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే స్టేషన్ సమీపంలో గల వరసిద్ధి వినాయకుని కోవెలలో రైల్వే యూనియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో భారీగా అన్న సమారాధన నిర్వహించారు. అదేవిధంగా స్థానిక పిఎంఎల్ కాంప్లెక్స్ లో సాయి వెంకటేశ్వర హాస్పిటల్ డాక్టర్ రాజు మేతృత్వంలో హాస్పిటల్ ఆవరణంలో భారీ నుండి అతి భారీగా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా గత 15 రోజులుగా సాయి వెంకటేశ్వర హాస్పిటల్ ఆవరణంలో డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయకుడికి ప్రతి రోజు ధూప దీప నైవేద్యాలతో పూజలు అభిషేకాలు నిర్వహించి 15 రోజున నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా మేళ తాళాలతో తీన్మార్ డప్పులతో స్వామివారిని ఊరేగించి అనంతరం బుధవారం రాత్రి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో సాయి వెంకటేశ్వర హాస్పిటల్ యాజమాన్యం మరియు సిబ్బంది నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు.