కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
రాప్తాడులో రూ.1.30 కోట్ల సీసీ రహదారి నిర్మాణానికి భూమిపూజ
రాప్తాడు మేజర్ న్యూస్:-
రాప్తాడు మండల కేంద్రంలో రూ.1.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు గురువారం భూమిపూజ నిర్వహించారు. అధికారులు, టీడీపీ నాయకులు, ఎస్‌జేఆర్ కన్స్ట్రక్షన్ అధినేత సాకే జయరాముడు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, మండల ఇన్‌చార్జ్ ధర్మవరం మురళి మార్గదర్శకత్వంలో మండలంలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాప్తాడు మండల కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడంపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.సీసీ రహదారి నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారడంతో పాటు మౌలిక వసతులు మెరుగుపడతాయని అన్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, టీడీపీ నాయకులు గంగలకుంట రమణ, సాకే నారాయణ స్వామి , ఎంపీడీవో విజయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీవోలు అశోక్‌బాబు, అచ్యుతానంద, మరూరు గోపాల్, గంగలకుంట కృష్ణ, డిష్ వెంకటరాముడు, కేశవ, సోమర నారాయణస్వామి, ఇంద్ర, కొండప్ప, సి.రాము, సరోజమ్మ, బీరప్ప, జూటూరు రామకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ శివ, వినోద్, శ్రీనివాసులు, నరేంద్ర, పంచాయతీ కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు