BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

కూటమి మేయర్ అభ్యర్థిని గెలిపించండి

Select Suryaa Now
కూటమి మేయర్ అభ్యర్థిని గెలిపించండి

 

నగర అభివృద్ధికి సహకరించండి

కటారి కుటుంబం నగరానికి చేసిన సేవలను గుర్తించి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి

 

చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్ : నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రజలకు పిలుపు నిచ్చారు. నగర అభివృద్ధికి కటారి కుటుంబం గతంలో చేసిన సేవలను, ప్రజలకు అందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకుని కూటమి అభ్యర్థికి ప్రజలు అండగా నిలవాలని ఆయన కోరారు. గురువారం చిత్తూరు నగరం లోని స్థానిక గాంధీ విగ్రహం కూడలిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎం పీదగ్గు మల్ల ప్రసాదరావు, చిత్తూరు జిల్లా అధ్యక్షులు షణ్ముగ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్, రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ సి ఆర్ రాజన్, మాజీ డిప్యూటీ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ కాజూరు బాలాజీ, టిడిపి రాష్ట్ర బీసీ సంఘం నాయకులు వెంకటేష్, టిడిపి జిల్లా కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చిత్తూరు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని, నగరంలో మౌలిక సదుపాయాల కల్పన, రహదారుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి ప్రజలకు అవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. కటారి కుటుంబం నగర అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలు గుర్తించాలని గురజాల జగన్ మోహన్ కోరారు. ప్రజలతో మమేకమై నగర అభివృద్ధికి సహకరించే నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా చిత్తూరును మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ విలువైన ఓటును వినియోగించుకోవాలని సూచించారు.అభివృద్ధికి ప్రజల మద్దతు అవసరం చిత్తూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజలు ఐక్యంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే ప్రజల మద్దతు, సహకారం కీలకమని అన్నారు. కూటమి అభ్యర్థి కటారి హేమలతకు అత్యధిక మెజారిటీ అందించి విజయాన్ని చేకూర్చాలని కోరారు. అనంతరం కూటమి మేయర్ అభ్యర్థి కటారి హేమలత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తమ కుటుంబం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తుందని, అందులో భాగంగానే 2014 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు నగర మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం తరపున పోటీ చేసే అవకాశం కల్పించారు. చిత్తూరు నగర ప్రజలు సైతం తమ కుటుంబానికి తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు వేసి మెజారిటీ కల్పించడం జరిగిందని అన్నారు. అనివార్య కారణాల వల్ల తమ అత్త మామ మృతి చెందడంతో తమ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోవడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులు తనకు చిత్తూరు మేయర్ అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. 2019 వ సంవత్సరం వరకు తను మేయర్ అభ్యర్థిగా చిత్తూరు అభివృద్ధికి విశేష కృషి చేయడం జరిగిందని అన్నారు. 2019 వ సంవత్సరంలో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ కుటుంబాన్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని కానీ తెలుగుదేశం పార్టీ కోసం అన్ని ఇబ్బందులను ఎదుర్కొని పార్టీ అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. తనకు కూటమి మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, చిత్తూరు ఎంపీ దగ్గు మల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు నగర ప్రజలు తనకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే అవకాశాన్ని తనకు కల్పించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నిక కాబడిన 50 డివిజన్ల కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.