BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో 300 మందికి సురక్షిత ఆశ్రయం సోలార్ ఎనర్జీ సేవలు ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ సీఎం సురేష్* పేదింటి ఆడపడుచు పెళ్లికి సర్పంచ్ కానుక శభాస్ సంపత్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు... హెలెన్ కన్సమ్షన్ ఖర్చులపై ద్రవ్యోల్బణ ప్రభావం నీటిలో మునిగిపోయిన పంటలను పరిశీలించిన....డాక్టర్ జి జోగి నాయుడు. గుడ్లూరు చెరువు చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఎస్.టి (SST) తనిఖీలను ఆకస్మికంగా పరిశీలించిన జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి ఉధృతంగా ప్రవహిస్తున్న గోముఖీ, సువర్ణముఖి నదులు మునిసిపల్ ఎన్నికలపై జిల్లా ఎస్పీ సమీక్ష మూడో త్రైమాసికంలో 77 శాతం ఎగబాకిన బోలిడెన్ లాభాలు! బీసీ కుల సంఘాలు, కులవృత్తిదారుల ఆత్మీయ సదస్సు ఎన్నికల నిర్వహణపై పి.ఓలకు, ఏ.పి.ఓలకు శిక్షణ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న బీఆర్‌ఎస్ నేతలు *49వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి బొడ్డేటి మాధవి కిరణ్ కుమార్ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి

కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి

పర్చూరు, మేజర్‌న్యూస్‌ : 
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి కూటమి జెండాను రెపరెపలాడించాలని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఎన్నికల బరిలో ఐక్యంగా ముందుకు సాగుతూ కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం ఎమ్మెల్యే ఏలూరి క్యాంపు కార్యాలయంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, కూటమి ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలు, అక్రమాలు, అహంకారపూరిత పాలనకు ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని గుర్తుచేశారు. తెదేపా అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నాయకత్వంలో తెదేపా, జనసేన, భాజపా కూటమిగా ఏర్పడి పనిచేశాయని తెలిపారు. అదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సొంతం చేసుకోవాలన్నారు. 
ఆరు స్థానాల్లోనూ గెలుపు బాధ్యత మనదే : 
సీట్ల సర్దుబాటులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రత్యేక చొరవ చూపారని ఏలూరి తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలో జనసేనకు ఒక జడ్పీటీసీ, ఐదు ఎంపీటీసీ స్థానాలు కేటాయించామని, ఇచ్చిన మాట ప్రకారం ఆరు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. పార్టీలు, వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గతంలో వివిధ హోదాల్లో పనిచేసిన వారితోపాటు కొత్తగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతలో భాగంగా పోటీలో ఉన్న మహిళా అభ్యర్థులను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలతో మమేకమై సమస్యలు తెలుసుకోవాలి : 
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రతి ఓటరును నేరుగా కలిసి వారి సమస్యలను తెలుసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసే ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నారు. ఎన్నికల అనంతరం ప్రభుత్వ వ్యవస్థల సహకారంతో స్థానిక సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలందించాలని చెప్పారు. ప్రతి గ్రామం, వార్డులో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించాలని, అభ్యర్థుల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. బీఫారాలు పొందిన అభ్యర్థులను గౌరవిస్తూ వారిని గెలిపించుకునేందుకు సమష్టిగా పనిచేయాలన్నారు.
ప్రచారం నుంచి పోలింగ్ వరకు అప్రమత్తంగా ఉండాలి : 
ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఎన్నికల ఏజెంట్లను నియమించుకోవడంతోపాటు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏలూరి సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో జడ్పీటీసీకి తెలుపు రంగు, ఎంపీటీసీకి గులాబీ రంగు బ్యాలెట్ పత్రాలు ఉంటాయని, వాటి వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో కృషిచేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, రెచ్చగొట్టే పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటిస్తూ ఖర్చుల వివరాలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎంపీటీసీ అభ్యర్థులకు రూ.4 లక్షలు, జడ్పీటీసీ అభ్యర్థులకు రూ.8 లక్షల వరకు ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో ఉంచుకుని, ఖర్చులకు సంబంధించిన బిల్లులను భద్రపరిచి నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల అనంతరం సర్పంచి ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో కూటమి శ్రేణులు ఇదే ఐక్యతను కొనసాగిస్తూ విజయాల పరంపరను సృష్టించాలని ఎమ్మెల్యే ఏలూరి ఆకాంక్షించారు. సమావేశంలో జనసేన నేతలు విజయ్ కుమార్, శ్రీకాంత్ , మార్కెట్ కమిటీ చైర్మన్ గుంజి వెంకట్రావు, జడ్పిటిసి సభ్యులు నక్కల రాఘవ, షేక్ రజాక్ , పోతిన సరిత, పూజల శ్రీనివాసరావు, డక్కుమల్లి పల్లవి, కలవకూరి పిచ్చమ్మ , మండల పార్టీ అధ్యక్షులు హనుమంతరావు, శ్రీనివాసరావు, తారక రామారావు, కొల్లా శ్రీనివాసరావు ,షేక్ ఖాసీం, నరహరి శ్రీనివాసరావు ,కూటమి బలపరిచిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు, తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష.