కూటమి అభ్యర్థుల గెలుపుకు మాచాని సోమనాథ్ ముమ్మర ప్రచారం
కూటమి అభ్యర్థుల గెలుపుకు మాచాని సోమనాథ్ ముమ్మర ప్రచారం
ఎమ్మిగనూరు సూర్య ప్రతినిధి.. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని శివన్న నగర్‌లో గురువారం 43, 44 వార్డుల్లో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మాచాని సోమనాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో మమేకమై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.త్వరలో జరగనున్న ఎమ్మిగనూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ బలపరిచిన చైర్మన్ అభ్యర్థి శ్రీమతి మాచాని సునీతతో పాటు కూటమి కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఆయన ఓటర్లను కోరారు. అభ్యర్థులకు తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానికులతో మాట్లాడి ఎన్నికలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ, కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. ఎమ్మిగనూరు చేనేత ముద్దుబిడ్డగా గుర్తింపు పొందిన డాక్టర్ మాచాని సోమనాథ్ ఇంటింటి ప్రచారం ద్వారా ఓటర్లను కలుసుకున్నారు.
రాజ శరత్ కుమార్ సూర్య ప్రతినిధి ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా