BREAKING
స్థానిక సంస్థలు ఎన్నికల్లో వంద శాతం కూటమి అభ్యర్థులు గెలిచేలా అందరూ కలసి పనిచేయాలి. కేశవరంలో పోషణ మాసం ముగింపు ఉత్సవం రైతులపై కేసులు నమోదు ఖండిస్తున్నాం: బి ఆర్ ఎస్ లారీల రాకపోకలపై నియంత్రణకు చర్యలు తీసుకోవాలి గుంతకల్లు డీఎస్పీకి ఎస్‌ఎఫ్‌ఐ వినతి గుర్రపు శ్రీనివాస్‌ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్‌ నాయకులు మీ కళ్లను ప్రేమించండి… కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి” కోవూరు మండలంలో పలువురు వైసీపీ నాయకులను పరామర్శించిన మాజీ మంత్రి నల్లపరెడ్డి.. ప్రజా ఆస్తుల పరిరక్షణకు నంద్యాలలో "ప్రజా భిక్షాటన"-విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చిన అఖిలపక్షం నాయకులు డిఎస్ఆర్ హైస్కూల్ లో ఉపాధ్యాయులు ,విద్యా కమిటీ,పేరెంట్స్ తో మంత్రి నారాయణ ఆత్మీయ సమావేశం. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి కనకదుర్గమ్మ ఆలయంలో దసరా మహోత్సవాలు. తాను పక్కా సెక్యులరిస్టును.. సైనికులే అసలైన రియల్ హీరోలు: ప్రముఖ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ ప్రజాదర్బార్ ప్రజలు, టీడీపీ కార్యకర్తల నుంచి వినతుల స్వీకరణ 5,400 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపెందుకు ప్రభుత్వం కుట్ర. సైడ్ కాలువలు ధ్వంసం మాకేం పట్టదంటున్నట్లు వ్యవహరిస్తున్న మున్సిపల్ సిబ్బంది...

కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు

Select Suryaa Now
కంకటపాలెం రైతులకు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలు

బాపట్ల, మేజర్ న్యూస్ 

సమగ్ర భూ రీ-సర్వే ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో బాపట్ల మండలం కంకటపాలెం గ్రామ రైతులకు నూతన పట్టాదారు పాస్‌ పుస్తకాలను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు పంపిణీ చేశారు. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, అధికారిక రాజముద్రతో రూపొందించిన పాస్‌ పుస్తకాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుల భూములకు పూర్తి రక్షణ కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర భూ రీ-సర్వే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన నూతన పాస్‌ పుస్తకాలతో భూములపై రైతులకు మరింత భద్రత, హక్కులకు రక్షణ కలుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో భూములకు సంబంధించిన సమస్యలను తగ్గించేందుకు రీ-సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో హరికుమార్, తహసీల్దార్ సలీమా, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.